దృశ్యం 3' రెడీ: మోహన్‌లాల్

దృశ్యం 3′ రెడీ: మోహన్‌లాల్

మోహన్‌లాల్ బిగ్ అనౌన్స్‌మెంట్: ‘దృశ్యం 3’ రాబోతోంది!

ఇంటర్నెట్‌డెస్క్: సినీ అభిమానులకు ఒక గొప్ప వార్తను అందించారు అగ్ర కథానాయకుడు మోహన్‌లాల్ (Mohanlal). ‘దృశ్యం 3‘ (Drishyam 3) రాబోతోందని అధికారికంగా ప్రకటించారు. జీతూ జోసెఫ్ (Jeethu Joseph) దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ ‘దృశ్యం’. 2013లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు, ఇతర భాషల్లోనూ రీమేక్ అయి, అన్ని చోట్లా అద్భుత స్పందనను సొంతం చేసుకుంది.

Advertisements
దృశ్యం 3' రెడీ: మోహన్‌లాల్
దృశ్యం 3′ రెడీ: మోహన్‌లాల్

ఓటీటీలో సంచలన విజయం సాధించిన ‘దృశ్యం 2’

ఆ చిత్రానికి కొనసాగింపుగా ‘దృశ్యం 2‘ వచ్చింది. అయితే, కరోనా కారణంగా ఓటీటీలో విడుదలైన ఈ మూవీకి భాషలతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆదరించారు. మోహన్‌లాల్ నటన, జీతూ జోసెఫ్ టేకింగ్, ట్విస్టింగ్‌కు అందరూ ఫిదా అయ్యారు. ఆ కథను కొనసాగిస్తూ మూడో భాగం ఉంటుందని దర్శకుడు జీతూ జోసెఫ్ అనేక వేదికలపై ప్రకటించారు. సినిమా పట్టాలెక్కడానికి మూడు నాలుగేళ్లు పడుతుందని అన్నారు. అన్నట్లుగానే ఇప్పుడు ‘దృశ్యం 3’ పూర్తి స్క్రిప్ట్ సిద్ధమైందని సమాచారం. దీంతో మోహన్‌లాల్ ఈ విషయాన్ని తెలియజేస్తూ ‘గతం ఎప్పటికీ నిశ్శబ్దంగా ఉండదు… ‘దృశ్యం 3′ రాబోతోంది’ అని పేర్కొన్నారు. దర్శకుడు జీతూ జోసెఫ్, నిర్మాత ఆంటోనీ పెరుంబవూర్‌తో కలిసి దిగిన ఫోటోను పంచుకున్నారు.

దృశ్యం 3′ స్క్రిప్ట్ సిద్ధం – మోహన్‌లాల్ అధికారిక ప్రకటన

దర్శకుడు జీతూ జోసెఫ్ గతంలోనే మూడో భాగం ఉంటుందని హింట్ ఇచ్చారు. ఇప్పుడు మోహన్‌లాల్ స్వయంగా ‘దృశ్యం 3’ రాబోతోందని అధికారికంగా వెల్లడించారు.

Related Posts
ఓటీటీ లోకి వచ్చేసిన ‘చాల్చిత్రో’ మూవీ
ఓటీటీ లోకి వచ్చేసిన ‘చాల్చిత్రో’ మూవీ

ఓటీటీలో ప్రతినిత్యం కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదలవుతూనే ఉంటాయి. కానీ, వాటిలో కొన్ని మాత్రమే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తాయి. ముఖ్యంగా, క్రైమ్, సస్పెన్స్, హారర్ జానర్ Read more

ఏఎన్నార్ బయోపిక్ మీద నాగ్ కామెంట్
nagarjuna

అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్నార్‌) జీవితాన్ని బయోపిక్‌గా తీసుకురావడం గురించి ప్రశ్నిస్తే, ఆయన కుమారుడు నాగార్జున ఎప్పుడూ ఒకేలా స్పందిస్తారు. "నాన్నగారి జీవితం విజయాల పర్యాయపదం. ఒక జీవిత Read more

మంచు మనోజ్, మౌనికపై కేసు నమోదు..
mohan babu case on manoj

టాలీవుడ్ సీనియర్ హీరో మంచు మోహన్ బాబు కుటుంబంలో చోటు చేసుకున్న సంఘటనలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు కాస్తా పోలీస్ Read more

లోకల్‌లో-నాన్‌ లోకల్‌ టాలీవుడ్ షూటింగ్ అప్‌డేట్స్
tollywood news 28

ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమలో షూటింగ్‌లు వేగంగా కొనసాగుతున్నాయి. వివిధ స్థాయిలో హిట్స్‌ అందించిన హీరోలు, ప్రముఖ దర్శకుల సినిమాలు టాప్ గేర్‌లో ఉన్నాయి. లోకల్ లొకేషన్లతో పాటు Read more