బెంగళూరు లో మొదలైన త్రాగునీటి కొరత,కార్లు కడిగితే జరిమానా

బెంగళూరు లో మొదలైన త్రాగునీటి కొరత,కార్లు కడిగితే జరిమానా

వేసవి తాపానికి నీటి కొరత భయంతో  బెంగళూరు వాటర్ బోర్డ్ ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టింది. గతేడాది తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కొన్న అనుభవంతో ఈసారి అధిక ఉష్ణోగ్రతలకు ముందు నుంచే పటిష్ఠ ప్రణాళికను రూపొందించింది. ముఖ్యంగా త్రాగునీటి వృథాను అరికట్టేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంది.బెంగళూరు నగరంలో తాగునీటి వినియోగంపై మున్సిపల్ బోర్డ్ పక్కా పర్యవేక్షణ అమలు చేయనుంది. త్రాగునీటిని వాహనాలు కడగడానికి, తోటల పెంపకానికి, నిర్మాణ పనులకు, ఫౌంటెయిన్‌లకు ఉపయోగించినట్టు గుర్తిస్తే రూ. 5,000 జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఒకసారి జరిమానా చెల్లించిన తర్వాత కూడా మళ్లీ అదే తప్పు చేస్తే అదనంగా మరో రూ. 5,000 మరియు రోజుకు రూ. 500 చొప్పున ఫైన్ విధిస్తామని స్పష్టం చేసింది.ఈ చర్యలు వాటర్ బోర్డ్ యాక్ట్‌లోని సెక్షన్ 109 ప్రకారం అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. నగరవాసులకు, షాపింగ్ మాల్స్, ఫంక్షన్ హాల్స్, సినిమా థియేటర్ల నిర్వాహకులకు నీటి వృథా చేయరాదని హెచ్చరికలు జారీ చేశారు. ఎవరైనా త్రాగునీటిని వృథా చేస్తుంటే తమ కాల్ సెంటర్ నెంబర్ 1916కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.గతేడాది వేసవిలో బెంగళూరులో సుమారు 14,000 బోరుబావులు ఎండిపోయిన విషయం తెలిసిందే. ఈసారి మళ్లీ అలాంటి పరిస్థితి ఎదురుకాకుండా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల భూగర్భ జలాలు మరింత వేగంగా అడుగంటే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్ సి) శాస్త్రవేత్తలు కూడా భవిష్యత్తులో బెంగళూరులో త్రాగునీటి కొరత మరింత తీవ్రంగా ఉండొచ్చని తెలిపారు.

p4b8lmr8 bengaluru water crisis 625x300 13 March 24

అధికారులు త్రాగునీటి పొదుపు కోసం ప్రజలకు కొన్ని సూచనలు చేశారు. అనవసరంగా నీరు వృథా కాకుండా చూడాలని, కార్లు, బైకులు కడగడంవంటివి చేయకూడదని తెలిపారు. ఇంటి పైకప్పుల నుంచి వర్షపు నీటిని సేకరించేందుకు రేన్‌వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ అమలు చేయాలని సూచించారు.వాటర్ బోర్డ్ తీసుకున్న ఈ చర్యలు ప్రజలకు కొంత అసౌకర్యంగా అనిపించినా, భవిష్యత్తులో నీటి కోసం ఎదుర్కోవాల్సిన కష్టాలను దృష్టిలో పెట్టుకుంటే ఇది ఎంతో అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వేసవి వేడిలో ఒక్కొక్క నీటి బొట్టు అమూల్యమని గుర్తించి, ప్రతి ఒక్కరూ బాధ్యతగా నీటిని వాడాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.అందువల్ల, ఈ వేసవిలో నీటి పొదుపు అవసరాన్ని గమనించి, ప్రతి ఇంట్లో నీటిని జాగ్రత్తగా వినియోగించుకోవడం ద్వారా అందరూ సహకరించాలని వాటర్ బోర్డ్ కోరుతోంది. అప్పుడే నగరంలో తాగునీటి కొరత సమస్యకు కొంతమేర ఉపశమనంగా మారనుంది.

త్రాగునీటివృథాపై సమాచారం అందించాలని నగరవాసులకు విజ్ఞప్తి

త్రాగునీటిని వృథా చేస్తూ ఎవరైనా కనిపిస్తే, కాల్ సెంటర్ నెంబర్ 1916 కు ఫోన్ చేసి తెలియజేయాలని సూచించింది. నీటి వృథాపై కఠిన చర్యలు తీసుకుంటామని ,బెంగళూరు వాటర్ బోర్డ్ ప్రజలను కోరింది.

Related Posts
భారీగా పొగమంచు 200 విమానాలు ఆలస్యం..
200 flights delayed due to heavy fog

న్యూఢిల్లీ: ఉత్తరాది రాష్ట్రాలపై పొగమంచు తీవ్రత కొనసాగుతోంది. ఢిల్లీ సహా సమీప రాష్ట్రాలను దట్టమైన పొగమంచు కమ్మేసింది. మంచు దుప్పటి కారణంగా దృశ్యమానత జీరోకు పడిపోయింది. దీంతో Read more

మహా కుంభమేళా : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరు
మహా కుంభమేళా

మహా కుంభమేళా 2025 – విశేషాలు, షెడ్యూల్ & రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హాజరు హిందూ సంస్కృతిలో అత్యంత పవిత్రమైన మేళాలలో మహా కుంభమేళా ప్రాముఖ్యత అంతాఇంతా Read more

మల్లిఖర్జున ఖర్గే వ్యాఖ్యలకు సీఎం యోగి ఆదిత్యనాథ్ కౌంటర్‌
CM Yogi Adityanath counters Mallikarjun Kharge comments

న్యూఢిల్లీ: సన్యాసులు రాజకీయాల్లోంచి తప్పుకోవాలని మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏఐసీసీ చీఫ్ మల్లిఖర్జున వ్యాఖ్యనించారు. అయితే ఈ వ్యాఖ్యలపై సీఎం యోగి ఆదిత్యనాథ్ స్ట్రాంగ్ కౌంటర్ Read more

సీఆర్పీఎఫ్ స్కూల్స్ మూసేయండి.. భారత్‌కు పన్నూన్ వార్నింగ్..
vaa copy

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న సీఆర్పీఎఫ్ పాఠశాలలకు గత కొన్ని రోజులుగా బూటకపు బాంబు బెదిరింపులు పంపబడుతున్నాయి. ఈ నేపథ్యంలో, అమెరికాలోని ఖలిస్థానీ ఉగ్రవాది గురు పత్వంత్ సింగ్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *