ప్రతిరోజూ ఇంట్లో వినియోగించే ట్యాప్ వాటర్ (Tap water) ప్రమాదంగా మారవచ్చని తాజా సంఘటన హెచ్చరిస్తోంది. అమెరికాలో 71 ఏళ్ల మహిళ ట్యాప్ వాటర్ వాడిన తర్వాత బ్రెయిన్ ఈటింగ్ అమీబా (Brain-eating amoeba) వల్ల మృతిచెందారు. ఇది వినడానికి విస్మయం కలిగించినా, వైద్యులు ఇది నిజమని స్పష్టం చేస్తున్నారు.ఆ మహిళ తన ఆర్‌వీ (RV) వాటర్ సిస్టమ్ నుంచి వచ్చిన నీటిని ముక్కులోకి పోయేలా వినియోగించారు. ఆ నీటిలో Naegleria Fowleri అనే అతి అరుదైన అమీబా ఉండటంతో ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఇది బ్రెయిన్ ఈటింగ్ అమీబా అనే పేరుతో కూడా గుర్తించబడుతుంది. ముక్కు ద్వారా ఒల్ఫాక్టరీ నర్వ్‌ను చేరి, మెదడును తీవ్రంగా దెబ్బతీస్తుంది.
వైద్యుల హెచ్చరికలు: పాము కన్నా ప్రమాదకరం
ఈ అమీబా వల్ల ప్రైమరీ అమీబిక్ మెనింజోఎన్సెఫలైటిస్ (PAM) అనే తీవ్రమైన మస్తిష్క సంక్రమణ జరుగుతుంది. ప్రారంభంలో తలనొప్పి, జ్వరం, వాంతులు, మెడ కట్టిపడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. తర్వాతి దశల్లో అపస్మారక స్థితి, శరీరం ఫెయిల్యూర్, చివరకు కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. ఇది లక్షణాల తర్వాత కేవలం 5 రోజుల్లో ప్రాణాలు తీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.Naegleria Fowleri ఇన్ఫెక్షన్ ప్రపంచ వ్యాప్తంగా వేల కోట్ల మందిలో ఒక్కొక్కరికి మాత్రమే వస్తుంది. కానీ ఒకసారి దాని బారిన పడితే తట్టుకోవడం అసాధ్యం. అందుకే ముందే జాగ్రత్తలు అవసరం.
ఎలా జాగ్రత్తపడాలి?
ట్యాప్ వాటర్‌ను నేరుగా వాడొద్దు.
నీటిని మరిగించి వినియోగించాలి.
స్టెరిలైజ్ లేదా డిస్టిల్డ్ వాటర్ మాత్రమే ఉపయోగించాలి.
ముక్కు ద్వారా నీరు వెళ్లే చర్యలు నివారించాలి.
నదులు, సరస్సుల్లో మునిగేటప్పుడు ముక్కు కప్పుకోవాలి.
వేడి నీటిలో సైతం ఇది బతికే ప్రమాదం
ఈ అమీబా 30 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలో కూడా బతుకుతుంది. అంటే, వేడి నీటిలో కూడా ఇది ప్రమాదంగా మారవచ్చు. కావున స్వచ్ఛమైన నీరు వినియోగించడమే ఉత్తమ జాగ్రత్త.
Read Also : Fake ICE Agent : అమెరికాలో భారతీయ యువతికి షాక్ : 5 వేల డాలర్ల నష్టం