ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో ఓర్వకల్లుకు అరుదైన గౌరవం దక్కింది ఇక్కడి డీఆర్డీవో (DRDO) కేంద్రంలో భారత్‌కు భద్రత పరంగా కొత్త శకం ఆరంభమైంది.అత్యాధునిక లేజర్ ఆయుధ వ్యవస్థను పరీక్షించి, విజయవంతంగా ప్రయోగించడంతో దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.ఈరోజు ఓర్వకల్లులో 30 కిలోవాట్ల శక్తి ఉన్న లేజర్ ఆయుధాన్ని ప్రయోగించారు.ఈ పరీక్షలో ప్రధాన లక్ష్యం డ్రోన్లు, మిస్సైళ్లు, ఫిక్స్‌డ్ వింగ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను లక్ష్యంగా చేసుకొని వాటిని తుదమూలానికి చేర్చడం.పరీక్షలో లేజర్ కిరణం లక్ష్యాన్ని తాకగానే, ఆ వస్తువు క్షణాల్లో బూడిదగా మారిపోయింది. ఇది పరిశోధనల్లో ఒక కీలక మైలురాయిగా భావిస్తున్నారు.ఈ పరీక్ష విజయవంతంగా పూర్తవడంతో భారత్ ప్రపంచ రక్షణ రంగంలో కీలక స్థానానికి చేరుకుంది.

ఇప్పటివరకు ఈ తరహా లేజర్ ఆయుధ వ్యవస్థలు ఉన్న దేశాల్లో అమెరికా, చైనా, రష్యా మాత్రమే ఉన్నాయి.ఇప్పుడు వాటి సరసన భారత్ కూడా నిలిచింది.డీఆర్డీవో తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఈ ప్రయోగానికి సంబంధించిన వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో లేజర్ బీమ్ డ్రోన్‌ను ఎలా ఛేదించిందో స్పష్టంగా కనిపిస్తుంది. ఒక్క కిరణంతో ఆకాశంలో ఉన్న లక్ష్యాన్ని నేలమట్టం చేయగలగడం, టెక్నాలజీలో భారత్ ఎంత ముందుకెళ్లిందో చూపిస్తోంది. ఈ ఆయుధ వ్యవస్థతో భారత సైన్యం భవిష్యత్ యుద్ధ శక్తిని మరింత బలపరుచుకోనుంది.
వాస్తవానికి డ్రోన్లు, మిస్సైళ్లు వంటి హవాలో గిరగిరలాడే ఆయుధాలను కూల్చడం ఓ పెద్ద సవాల్ అయితే ఈ లేజర్ టెక్నాలజీతో అలా కాకుండా క్షణాల్లో వాటిని నిర్వీర్యం చేయడం సాధ్యమైంది. భవిష్యత్‌లో సరిహద్దుల్లోకి చొరబడే శత్రు డ్రోన్లు, మిస్సైళ్లను ముందుగానే గుర్తించి తురగయానంగా వాటిని తునాతునకలుచేసే శక్తి ఈ టెక్నాలజీకి ఉంది. దీని వల్ల జవాన్ల ప్రాణాలను రక్షించడమే కాకుండా, సరిహద్దుల్లో సెక్యూరిటీ మరింతగా బలపడనుంది.ఈ విజయం దేశ అభివృద్ధికి సూచిక మాత్రమే కాదు, ప్రపంచానికి భారత్ సైనికంగా ఎంతగా ఎదుగుతోందో చెప్పే ఉదాహరణ. ఓర్వకల్లులో జరిగిన ఈ లేజర్ ఆయుధ పరీక్ష భారత రక్షణ రంగానికి మైలురాయి. ఇలాంటి ఆధునిక ఆయుధ సాంకేతికతతో భారత్ త్వరలోనే సూపర్ డిఫెన్స్ పవర్‌గా నిలవబోతోంది.
Read Also :Nara Lokesh: వంద పడకల ఆసుపత్రి 365 రోజుల్లో సిద్ధం: నారా లోకేశ్