Dragon Movie :డ్రాగన్ మూవీ రివ్యూ

Dragon Movie :డ్రాగన్ మూవీ రివ్యూ

ప్రదీప్ రంగనాథ్ హీరోగా నటించిన “డ్రాగన్” సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. “లవ్ టుడే” సినిమాతో యువతలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ప్రదీప్,డ్రాగన్ సినిమాతో మరోసారి తన నటనలోని వేరియేషన్స్ చూపించాడు. అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 21న విడుదలై 150 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. తమిళంతో పాటు తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా విడుదలైంది.

Advertisements

కథ

2014 నుంచి 2025 మధ్య కాలంలో కథ నడుస్తుంది.రాఘవన్ (ప్రదీప్ రంగనాథ్) మిడిల్ క్లాస్ యువకుడు.ఇంజనీరింగ్ విద్యార్థి అయిన అతనిపై తల్లిదండ్రులకు ఎన్నో ఆశలు ఉన్నాయి.కానీ అతను చదువుపై ఆసక్తి లేకుండా, భవిష్యత్తును నిర్లక్ష్యం చేస్తాడు.ప్రేమించిన అమ్మాయి కీర్తి (అనుపమ పరమేశ్వరన్) అతన్ని వదిలిపెట్టి ఓ పెద్ద ఉద్యోగిని పెళ్లి చేసుకుంటుంది.ఆమె భర్త కంటే ఒక్క రూపాయి ఎక్కువ సంపాదించాలి అనే కోరికతో నకిలీ సర్టిఫికెట్లు సమర్పించి ఉద్యోగం పొందుతాడు.
తన తల్లిదండ్రులను మోసం చేసి 10 లక్షలు తీసుకొని పొలం తాకట్టు పెట్టించి కోటీశ్వరుడవుతాడు.పెద్ద వ్యాపారవేత్త పరశురామ్ తన కూతురిని అతనికి ఇచ్చి పెళ్లి చేయడానికి సిద్ధమవుతాడు.కానీ ఓ అనూహ్య సంఘటనతో రాఘవన్ జీవితం పూర్తిగా మారిపోతుంది.ఈ సంఘటన ఏమిటి? రాఘవన్ జీవితం ఎలాంటి మలుపు తీసుకుంది? అనేదే సినిమా కథ.

విశ్లేషణ

ఈ సినిమా “కష్టపడకుండా సంపాదించిన విజయానికి విలువ ఉండదని” చెప్పే ప్రయత్నం చేస్తుంది. కష్టపడకుండా సంపాదించిన ధనం ఎంతవరకు నిలుస్తుందో, అది మన జీవితంపై ఎలా ప్రభావం చూపిస్తుందో ఈ కథ ద్వారా దర్శకుడు చూపించాడు.

dragon 1

తల్లిదండ్రుల ప్రధాన పాత్రలు

ప్రతి ఒక్కరి జీవితంలో తల్లిదండ్రులు గురువు భార్య చాలా ముఖ్యమైన పాత్రలను పోషిస్తారు. విజయాన్ని సాధించినప్పుడు సంతోషపడేవారిలో ఆ ముగ్గురూ ముందుంటారు. తన సంతోషం కోసం ఆ ముగ్గురినీ మోసం చేయడానికి ప్రయత్నించిన ఒక యువకుడికి ఎలాంటి పరిస్థితి ఎదురవుతుంది? అప్పుడు అతను ఏం చేస్తాడు? అనే ప్రధానమైన సమస్యతో ఈ కథ పరిగెడుతుంది.

సందేశం

ప్రేమించిన అమ్మాయి నీ నుంచి ఏం కోరుకుంటుందో తెలుసుకో.నీకు సాధ్యం కానిది అడుగుతుందని భయపడి దూరం జరగకు.మరొకరికి దగ్గరైందని పగబట్టకు.”ఈ విషయాన్ని యూత్ కు, ఫ్యామిలీ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా చెప్పడం మంచి ప్లస్ పాయింట్.

సాంకేతిక విశ్లేషణ

అశ్వత్ మారిముత్తు కథ చెప్పే విధానం ఆకట్టుకుంటుంది.ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ ట్విస్ట్ సినిమాకు హైలైట్.స్క్రీన్ ప్లే కుటుంబ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యేలా తీర్చిదిద్దారు.ప్రదీప్ రంగనాథ్ తన నటనతో ఆకట్టుకున్నాడు.అనుపమ పరమేశ్వరన్ పాత్ర సినిమాకు ప్రధాన బలం.మిస్కిన్ నటన హైలైట్‌గా నిలిచింది.కేఎస్ రవికుమార్, గౌతమ్ మీనన్ పాత్రలు ప్రత్యేక ఆకర్షణ.లియోన్ జేమ్స్ సంగీతం కథకు మరింత బలాన్ని ఇచ్చింది

Related Posts
కల్పన హెల్త్ పై డాక్టర్స్ ప్రెస్ మీట్
కల్పన హెల్త్ పై డాక్టర్స్ ప్రెస్ మీట్

కల్పన ఆరోగ్య పరిస్థితి: ఆసుపత్రి వైద్యుల తాజా వివరాలు ప్రముఖ గాయని కల్పన ఆరోగ్య పరిస్థితి గురించి హోలిస్టిక్ ఆసుపత్రి వైద్యులు తాజాగా మీడియాకు వివరాలను అందించారు. Read more

నిహారిక మాజీ భర్త రెండో పెళ్లి చేసుకోబోతున్నాడా
Niharika Konidela

నిహారిక కొణెదల మాజీ భర్త జొన్నలగడ్డ చైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్నాడా ఈ రోజు ఫిలిం సర్కిల్లో హాట్ టాపిక్ గా మారిన వార్తతో, నిహారిక కొణెదల Read more

ప్రేమ పెళ్లిపై నిర్ణయాలు మారాయి బాలీవుడ్ హీరో.
vivek oberoi

వివేక్ ఒబెరాయ్ ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం.బాలీవుడ్‌లో స్టార్ హీరోగా ఎన్నో విజయవంతమైన సినిమాలు అందించిన ఆయన, రక్త చరిత్ర సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు Read more

Laggam movie తెలంగాణ బిడ్డగా నటించడం అదృష్టం
laggam movie pre release event 2

సాయి రోనక్ ప్రగ్యా నగ్రా జంటగా ప్రముఖ నటులు రాజేంద్ర ప్రసాద్ రోహిణి కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘లగ్గం’ ఈ సినిమాకు రమేష్ చెప్పాల దర్శకత్వం Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×