हिन्दी | Epaper
తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్

వరంగల్‌లో విషాదం

Sudheer
వరంగల్‌లో విషాదం

వరంగల్‌లో విషాదం- వరంగల్‌లో సంచలనం రేపిన డాక్టర్ సుమంత్ రెడ్డి హత్యాయత్నం కేసు విషాదాంతమైంది. భార్య ఫ్లోరా మరియా, ఆమె ప్రియుడు శామ్యూల్ కలిసి సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించారు. ఫిబ్రవరి 20న కాజీపేట ఆసుపత్రి నుంచి ఇంటికి వస్తున్న సమయంలో దాడి జరిపి తీవ్రంగా గాయపరిచారు. దీంతో చికిత్స పొందుతూ డాక్టర్ సుమంత్ రెడ్డి శనివారం ఉదయం ఎంజీఎం ఆసుపత్రిలో కన్నుమూశారు.

doctor dies warangal

పరిచయం వివాహేతర సంబంధం

సుమంత్ రెడ్డి, ఫ్లోరా 2016లో ప్రేమ వివాహం చేసుకున్నారు. తర్వాత సంగారెడ్డికి మారి, అక్కడ తన బంధువుల విద్యాసంస్థల నిర్వహణలో భాగస్వామ్యం అయ్యారు. ఇదే సమయంలో ఫ్లోరా జిమ్‌లో శామ్యూల్ అనే ట్రైనర్‌ను కలుసుకుంది. వీరి పరిచయం వివాహేతర సంబంధంగా మారింది. ఈ విషయం భర్తకు తెలియడంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. పరిస్థితి మరింత విషమించడంతో సుమంత్ వరంగల్‌కు తిరిగి వెళ్లిపోయారు.

ప్రియుడితో కలిసి జీవించాలని ఫ్లోరా, శామ్యూల్ ప్లాన్

భర్తను తొలగించి, ప్రియుడితో కలిసి జీవించాలని ఫ్లోరా, శామ్యూల్ ప్లాన్ చేశారు. హత్య కోసం ఫ్లోరా లక్ష రూపాయలు సుపారీ ఇచ్చింది. శామ్యూల్ తన స్నేహితుడు, కానిస్టేబుల్ రాజ్‌కుమార్‌కు 50 వేలు అందించి సహాయం కోరాడు. ఫిబ్రవరి 20న హాస్పిటల్ నుంచి వస్తున్న సుమంత్ రెడ్డిని కారును అడ్డుకుని, సుత్తితో దాడి చేశారు. అతను చనిపోయాడని భావించి పరారయ్యారు. అయితే, స్థానికుల సమాచారం మేరకు బాధితుడిని ఆసుపత్రికి తరలించారు.

సీసీటీవీ ఫుటేజీలు ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్టు

కేసును దర్యాప్తు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీలు ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. ఫ్లోరా, శామ్యూల్, రాజ్‌కుమార్‌లపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ ఘటన వరంగల్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భార్య ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించడం సమాజంలో విలువల పతనాన్ని చర్యకరంగా చూపిస్తోంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870