Double roads from every village to the mandal.. Komati Reddy

Komatireddy venkat reddy: ప్రతి గ్రామం నుంచి మండలానికి డబుల్‌ రోడ్లు : కోమటిరెడ్డి

Komatireddy venkat reddy : అసెంబ్లీలో అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం భూములు అమ్మాలని నిర్ణయించడంపై ప్రతిపక్షాలు సభలో నిలదీశాయి. ఈ క్రమంలోనే ప్రతిపక్షాలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కౌంటర్ ఇచ్చాడు. కమీషన్లకు కక్కుర్తి పడి ORRను రూ.7,300 కోట్లకు అమ్ముకున్నారు. లక్ష కోట్ల విలువ చేసే రోడ్డును రూ.7,300 కోట్లకు అమ్ముకున్న వీళ్లు కూడా భూముల అమ్మకాల గురించి మాట్లాడుతున్నారు. హరీష్ రావుకు ఏం తెలియదు. ఆయన్ను ముందు పెట్టి వెనుక ఇద్దరు ఉండి నడిపిస్తున్నారు అని బీఆర్ఎస్ నేతలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.

ప్రతి గ్రామం నుంచి మండలానికి

రాష్ట్రమంతా తిరిగి చూద్దామా

కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన 40 శాతం కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు. వారికి ఆరు నెలలు లేదా మూడు నెలలకు చెల్లిస్తామన్నారు. ప్రతి గ్రామం నుంచి మండలానికి డబుల్‌ రోడ్లు వేయిస్తామని తెలిపారు. బీఆర్‌ఎస్‌ హయాంలో సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్‌కే రోడ్లు వేశారని చెప్పారు. ఆ మూడు చోట్ల రోడ్లకు చివరికి సింగరేణి నిధులు కూడా వాడారని పేర్కొన్నారు. ఛాలెంజ్‌ చేస్తున్నా.. రాష్ట్రమంతా తిరిగి చూద్దామా అని హరీశ్‌రావుకు సవాల్‌ విసిరారు. కోమటిరెడ్డి సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు హరీశ్‌రావు తెలిపారు. బీఆర్‌ఎస్‌ హయాంలో ఆర్‌అండ్‌బీ పనుల గురించి లెక్కలు తీద్దామన్నారు. రోడ్ల గురించి ఒకరోజు ప్రత్యేకంగా చర్చిద్దామని చెప్పారు.

Related Posts
Alleti Maheshwar Reddy: అప్పులపై బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
Alleti Maheshwar Reddy: అప్పులపై బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్రంలో ప్రతిరోజు సుమారు రూ. 1,700 కోట్లకు పైగా అప్పు చేస్తోందని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు Read more

మేఘా రక్షణపై కెటిఆర్ ఆగ్రహం
మేఘా రక్షణపై కెటిఆర్ ఆగ్రహం

మేఘా కంపెనీని బ్లాక్లిస్ట్ చేయాలని సిఫారసు చేసిన కమిటీ నివేదికను గోప్యంగా ఉంచడంలో ప్రధాన కారణం ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కి మరియు మేఘకృష్ణరెడ్డికి మధ్య కుదిరిన Read more

దిగ్గజ క్రికెటర్ కన్నుమూత
cricketer Syed Abid Ali

హైదరాబాద్‌కు చెందిన భారత మాజీ క్రికెటర్ సయ్యద్ అబిద్ అలీ (83) అమెరికాలో కన్నుమూశారు. 1967 నుండి 1975 వరకు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఆయన, Read more

సరస్వతీ పవర్ భూముల రిజిస్ట్రేషన్లు రద్దు..ఏపీ సర్కార్‌

అమరావతి: సరస్వతీ పవర్ ప్లాంట్‌కు కేటాయించిన అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్‌ను ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. సరస్వతీ భూముల్లో అసైన్డ్ ల్యాండ్స్ ఉన్నాయన్న అధికారుల నివేదికతో చర్యలు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *