Komatireddy venkat reddy : అసెంబ్లీలో అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం భూములు అమ్మాలని నిర్ణయించడంపై ప్రతిపక్షాలు సభలో నిలదీశాయి. ఈ క్రమంలోనే ప్రతిపక్షాలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కౌంటర్ ఇచ్చాడు. కమీషన్లకు కక్కుర్తి పడి ORRను రూ.7,300 కోట్లకు అమ్ముకున్నారు. లక్ష కోట్ల విలువ చేసే రోడ్డును రూ.7,300 కోట్లకు అమ్ముకున్న వీళ్లు కూడా భూముల అమ్మకాల గురించి మాట్లాడుతున్నారు. హరీష్ రావుకు ఏం తెలియదు. ఆయన్ను ముందు పెట్టి వెనుక ఇద్దరు ఉండి నడిపిస్తున్నారు అని బీఆర్ఎస్ నేతలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.

రాష్ట్రమంతా తిరిగి చూద్దామా
కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన 40 శాతం కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు. వారికి ఆరు నెలలు లేదా మూడు నెలలకు చెల్లిస్తామన్నారు. ప్రతి గ్రామం నుంచి మండలానికి డబుల్ రోడ్లు వేయిస్తామని తెలిపారు. బీఆర్‌ఎస్ హయాంలో సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్‌కే రోడ్లు వేశారని చెప్పారు. ఆ మూడు చోట్ల రోడ్లకు చివరికి సింగరేణి నిధులు కూడా వాడారని పేర్కొన్నారు. ఛాలెంజ్ చేస్తున్నా.. రాష్ట్రమంతా తిరిగి చూద్దామా అని హరీశ్‌రావుకు సవాల్ విసిరారు. కోమటిరెడ్డి సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు హరీశ్‌రావు తెలిపారు. బీఆర్‌ఎస్ హయాంలో ఆర్‌అండ్‌బీ పనుల గురించి లెక్కలు తీద్దామన్నారు. రోడ్ల గురించి ఒకరోజు ప్రత్యేకంగా చర్చిద్దామని చెప్పారు.