Dont fly Air India from November 1 19. Khalistani terrorist Pannuns new threat

నవంబర్ 19 వరకు ఎయిరిండియాలో ప్రయాణించొద్దు.. ఖలిస్థానీ టెర్రరిస్టు పన్నున్ హెచ్చరిక

న్యూఢిల్లీ: విమానాలకు బాంబు బెదిరింపులు కొనసాగుతున్న వేళ ఖలిస్థానీ ఉగ్రవాది గుర్‌పత్వంత్ సింగ్ పన్నున్ మరో హెచ్చరిక జారీ చేశాడు. నవంబర్ 1 నుంచి 19 మధ్య ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించవద్దని ప్రయాణికులను హెచ్చరించాడు. గతేడాది కూడా అతడు ఇలాంటి హెచ్చరికనే జారీచేశాడు.

సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్‌ఎఫ్‌జే) వ్యవస్థాపకుడు అయిన పన్నున్‌కు అమెరికా, కెనడా రెండు దేశాల పౌరసత్వం ఉంది. సిక్కుల ఊచకోత జరిగి 40 ఏళ్లు అయిన సందర్భంగా ఆయనీ హెచ్చరికలు జారీచేశాడు. ఆ విమానాల్లో ప్రయాణించి ప్రమాదం కొని తెచ్చుకోవద్దని హెచ్చరించాడు. ఎయిర్ ఇండియా విమానాలపై దాడి జరగొచ్చని పేర్కొన్నాడు.

కాగా, గత కొన్ని రోజులుగా పలు విమానాలకు బాంబు బెదిరింపులు వస్తున్నాయి. నిన్న కూడా 25 విమానాలకు నకిలీ బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇండిగో, విస్తారా, ఎయిర్ ఇండియా, ఆకాశ ఎయిర్‌లైన్స్‌కు చెందిన దేశీయ, అంతర్జాతీయ విమానాలు ఇందులో ఉన్నాయి. ఈ వారంలో 90కిపైగా విమానాలకు బెదిరింపులు వచ్చాయి. వరుస బెదిరింపుల నేపథ్యంలో విమనాశ్రయాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

Related Posts
విద్యుత్ వెలుగుల్లో ఏపీ సచివాలయం
Secretariat in electric lig

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీలోని అసెంబ్లీ మరియు సచివాలయం విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబయ్యాయి. ఈ భవనాలు విద్యుత్ వెలుగులతో ప్రకాశిస్తూ పండుగ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. సచివాలయంపై Read more

రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో రూ.47,776 కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు (శనివారం) ఢిల్లీ కి వెళ్లనున్నారు. ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన ప్రచారం చేయనున్నారు. ఎన్డీయే Read more

పెరగనున్న సిగరెట్ ధరలు!
పెరగనున్న సిగరెట్ ధరలు!

ధూమపాన ప్రియులకు త్వరలోనే కేంద్ర ప్రభుత్వం చేదువార్త చెప్పబోతోంది. సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల ధరలు మరింత పెరగనున్నాయి. పన్ను ఆదాయం తగ్గకుండా చూసుకునేలా, ప్రజలను ధూమపానం నుంచి Read more

‘అదానీ-రేవంత్ భాయ్ భాయ్’ టీషర్ట్ తో అసెంబ్లీకి బీఆర్ఎస్ నేతలు
KTR Assembly

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో రాజకీయ ఉత్కంఠ పెరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 'అదానీ-రేవంత్ భాయ్ భాయ్' అని ప్రింట్ చేసిన టీషర్ట్స్ ధరించి అసెంబ్లీకి వచ్చారు. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *