Don't believe false propaganda.. CM advises tribals

తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు: గిరిజ‌నుల‌కు సీఎం సూచ‌న‌

గిరిజన హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామంటూ చంద్ర‌బాబు ట్వీట్‌

అమరావతి: గిరిజన ప్రాంతాల్లో 1/70 చట్టాన్ని తొలగించే ఉద్దేశం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. వారి హక్కులను కాపాడతామన్నారు. పాడేరులో గిరిజనుల నిరసన నేపథ్యంలో ‘ఎక్స్’ వేదికగా సీఎం స్పందించారు. గిరిజన జాతుల అస్థిత్వాన్ని కాపాడుకోవడమంటే భారతీయ సంస్కృతిని కాపాడటమే అని అన్నారు. అందుకే వారి విద్య, వైద్యం, జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి తాము నిరంతరం పనిచేస్తున్నామ‌ని తెలిపారు.

గిరిజన ప్రాంతాల్లోని ఆస్తులపై వారికే హక్కు ఉండాలనే ఆలోచనతో వచ్చిన 1/70 చట్టాన్ని మార్చే ఉద్దేశం మాకు ఏమాత్రం లేదు. అలాంటి తప్పుడు ప్రచారాలు, అనవసరమైన అపోహలతో ఆందోళన చెందొద్దని గిరిజన సోదరులను కోరుతున్నా. సమాజంలో అట్టడుగున ఉన్న మీ అభివృద్ధికి సదా కట్టుబడి ఉన్నాం అని చంద్రబాబు అన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో జీవో నంబర్‌ 3 తీసుకురావడం ద్వారా గిరిజన ప్రాంతాల్లో ఉపాధ్యాయ పోస్టులు గిరిజనులకే దక్కేలా కృషి చేశాం. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా న్యాయపరమైన చిక్కులతో ఆ ఉత్తర్వులు రద్దయ్యాయి. దాని పునరుద్ధరణకు మేం కృషి చేస్తాం అన్నారు. అరకు కాఫీ సహా ఇతర గిరిజన ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తున్నాం అన్నారు. ఈ మేర‌కు సీఎం చంద్ర‌బాబు త‌న ట్వీట్‌లో రాసుకొచ్చారు.

Related Posts
డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ ద్వారా అమెరికాలో ధరలు పెరిగే అవకాశం
trump 3

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో అన్ని సమస్యల పరిష్కారంగా టారిఫ్స్ ని ప్రస్తావించారు. అయితే, ఆర్థికవేత్తలు ఈ టారిఫ్స్ వల్ల సాధారణ అమెరికన్ Read more

కొత్త ఐటీ చట్టంపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
KTR key comments on the new IT Act

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఐటీ చట్టంపైకీలక వ్యాఖ్యలు చేశారు. ఇది దేశ పౌరుల డిజిటల్ గోప్యతకు ముప్పుగా మారుతుందని అభిప్రాయపడ్డారు. Read more

రాహుల్ గాంధీకి పూణే కోర్టు సమన్లు జారీ
124

న్యూఢిల్లీ: పరువు నష్టం కేసులో కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ కి పూణె ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. గతేడాది Read more

ఐఎఎస్, ఐపీఎస్ అధికారులను బిజినెస్ స్కూల్స్ నుండి నియమించాలి:నరాయణ మూర్తి
narayanamurthy

ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు, ప్రముఖ వ్యాపారవేత్త నరాయణ మూర్తి ఇటీవల ఐఎఎస్ (Indian Administrative Service) మరియు ఐపీఎస్ (Indian Police Service) అధికారులను UPSC (Union Public Read more