హైదరాబాద్: నగరంలో గ్రీన్ ఛానల్ ఏర్పాటు ఓ గుండెను సాధ్యమైనంత వేగంగా తరలించి ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడారు. డాక్టర్లు హైదరాబాద్ మెట్రోలో గుండెను తరలించి అవసరమైన పేషెంట్ కు సకాలంలో ఆపరేషన్ చేశారు. ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రి నుంచి లక్డీకపూల్ గ్లోబల్ ఆసుపత్రికి మెట్రో రైల్లో శుక్రవారం రాత్రి 9.30 గంటలకు డాక్టర్ల టీమ్ గుండెను తరలించింది. ఇందుకోసం హైదరాబాద్ మెట్రో అధికారులు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి పెద్ద మనసు చాటుకున్నారు.
గ్రీన్ ఛానల్ ద్వారా హైదరాబాద్‌లో అది కూడా 13 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 13 నిమిషాల్లో గుండెను తరలించారు. సకాలంలో గ్లోబల్ హాస్పిటల్‌కు గుండె చేరడంతో అవసరమైన పేషెంట్‌కు డాక్టర్లు సర్జరీ చేసి గుండెను అమర్చారు. గతంలోనూ ఇలా గుండె, కిడ్నీ లాంటి ముఖ్యమైన అవయవాలు రోడ్డు మార్గం ద్వారా, మెట్రో రైలు ద్వారా తరలించడంతో ఎందరో ప్రాణాలు నిలిచాయి.
హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీ మరీ ఎక్కువగా ఉంటుంది. గుండె తరలింపులో ఆలస్యం కావొద్దు అన్న ఉద్దేశంతో మెట్రో రైలులో దాన్ని పంపింపారు. జనవరి 17వ తేదీన రాత్రి 9.30 నిమిషాల సమయంలో మెట్రో రైలు ద్వారా డోనార్ గుండెను తరలించారు. చాలా సునిశితమైన ప్లానింగ్, మెట్రో రైలు.. వైద్యులు, ఆస్పత్రి వర్గాల సహకారంతో ఆ ప్రయత్నం సఫలమైనట్లు తెలుస్తోంది.