Donald Trump VS Canada: కెనడాపై మరోసారి ధ్వజమెత్తిన ట్రంప్

Donald Trump VS Canada: కెనడాపై మరోసారి ధ్వజమెత్తిన ట్రంప్

Donald Trump VS Canada: కెనడాపై మరోసారి ధ్వజమెత్తిన ట్రంప్ అమెరికా-కెనడా మధ్య వాణిజ్య యుద్ధం ముదురుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాపై తీవ్ర విమర్శలు చేశారు. కెనడాను “దరిద్ర దేశాలలో ఒకటి” అంటూ వ్యాఖ్యానించారు.

ఒక ఇంటర్వ్యూలో కెనడాపై ఆయన ఎప్పుడూ ఎందుకు కఠినంగా ఉంటారో ప్రశ్నించగా ట్రంప్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.తాను అన్ని దేశాలతో సంబంధాలు కొనసాగిస్తానని కానీ కెనడాతో వ్యవహరించడం చాలా కష్టమని ట్రంప్ అన్నారు.కెనడా చెత్త దేశాల్లో ఒకటిగా అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు కెనడాలో తీవ్ర దుమారం రేపాయి.అమెరికా కెనడాకు ఏటా 200 బిలియన్ డాలర్లు సబ్సిడీ అందిస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు.

Donald Trump కెనడాపై మరోసారి ధ్వజమెత్తిన ట్రంప్
Donald Trump VS Canada: కెనడాపై మరోసారి ధ్వజమెత్తిన ట్రంప్

అందుకే కొందరు కెనడాను 51వ రాష్ట్రంగా పరిగణిస్తున్నారని వివరించారు.అయితే అమెరికాకు కెనడా అవసరం లేదని, వారి కలప, శక్తి వనరులు, ఆటోమొబైల్స్ కూడా అవసరం లేదని స్పష్టం చేశారు.ఇటీవల మార్క్ కార్నీ కెనడా ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ట్రంప్ వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ, ట్రంప్ తన దురుసు మాటలను తగ్గిస్తేనే చర్చలకు సిద్ధమని స్పష్టం చేశారు. కెనడాపై అమెరికా కఠిన వైఖరి అనవసరమని, పరస్పర అవగాహనతో సమస్యలు పరిష్కరించుకోవచ్చని కార్నీ అభిప్రాయపడ్డారు.ట్రంప్ వ్యాఖ్యలు కెనడా-అమెరికా సంబంధాలను మరింత విషమింపజేస్తాయా? లేదా, ఈ వివాదం త్వరలో సమసిపోతుందా అనేది చూడాలి.

Related Posts
సస్పెన్షన్ లెటర్ను ఫ్రేమ్ కట్టించుకున్నా తీన్మార్ మల్లన్న
Teenmaar suspend

తెలంగాణ రాజకీయాల్లో తీన్మార్ మల్లన్న మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ పార్టీకి ఏం చేశావని ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి Read more

డిపోల ప్రైవేటీకరణ పై TGSRTC క్లారిటీ
TSRTC Clarity on Privatizat

తెలంగాణ ఆర్టీసీ (TGSRTC) ఎలక్ట్రిక్ బస్సుల పేరిట డిపోల ప్రైవేటీకరణ జరుగుతోందన్న ప్రచారాన్ని ఖండించింది. ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ, ఛార్జింగ్ మినహా ఇతర కార్యకలాపాలు మొత్తం ఆర్టీసీ Read more

నేడు నల్గొండలో బీఆర్ఎస్ మహా ధర్నా
BRS Maha Dharna in Nalgonda today

హైదరాబాద్‌ : బీఆర్ఎస్ పార్టీ నేడు నల్లగొండ లో మహా ధర్నా నిర్వహించనుంది. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయనందుకు నిరసనగా ఈ ధర్నా చేపట్టింది. కాంగ్రెస్ Read more

న్యూఇయర్ కి హైదరాబాద్ మెట్రో టైమింగ్స్ పొడిగింపు!
Hyderabad Metro

హైదరాబాద్ నగరం నూతన సంవత్సరాన్ని ఘనంగా స్వాగతించేందుకు సిద్దమవుతుండగా, హైదరాబాద్ మెట్రో రైలు తన సేవలను డిసెంబర్ 31 అర్ధరాత్రి తర్వాత కూడా పొడిగించనున్నట్లు ప్రకటించింది. ఈ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *