కొన్ని రోజులుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచాన్ని కలవరపెడుతున్నారు.టారిఫ్‌ల పేరుతో దేశాలపై ఒత్తిడి పెంచుతున్నారు.ముఖ్యంగా చైనాను లక్ష్యంగా చేసుకుని భారీగా సుంకాలు విధిస్తున్నారు.చైనాకు మినహాయింపు లేకపోయినా, ఇతర దేశాలకు మాత్రం రోజుల గడువు ఇచ్చారు.అయితే తాజాగా ట్రంప్ తీసుకున్న నిర్ణయం టెక్ రంగానికి ఊరటనిచ్చింది.ట్రంప్ ప్రభుత్వం మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, చిప్‌లకు సుంకాల నుంచి మినహాయింపు ఇచ్చింది.యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ అధికారిక మార్గదర్శకాలను విడుదల చేసింది.ఈ నిర్ణయం వల్ల ఆపిల్, శాంసంగ్ వంటి దిగ్గజ సంస్థలకు ఊపిరి పీల్చుకునే అవకాశం దొరికింది.గడిచిన కొన్ని వారాలుగా అమెరికాలో టెక్ కంపెనీలు ఒత్తిడిలో ఉన్నాయి.

ఆపిల్‌పై ప్రభావం ఉండదు
చైనాలో ఉత్పత్తి చేయబడే ఉత్పత్తులపై ట్రంప్ అధిక సుంకాలు విధించనున్నారు.దీంతో ఆపిల్ వంటి సంస్థలపై ప్రభావం ఉంటుందన్న భావన పెరిగింది.కానీ ఇప్పుడు మినహాయింపుతో ఆ భయం తొలగింది.స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, హార్డ్ డ్రైవ్‌లు, సెమీకండక్టర్లకు మినహాయింపు వర్తిస్తుంది.ఈ వస్తువులు అమెరికాలో తక్కువగా తయారవుతాయి.పూర్తిగా ఉత్పత్తి చేయాలంటే సంవత్సరాలు పడతాయి.
చిప్ ఇండస్ట్రీకి ఇది మంచి వార్తే
చిప్ తయారీకి ఉపయోగించే యంత్రాలను కూడా మినహాయింపు జాబితాలో చేర్చారు.తైవాన్ సెమీకండక్టర్ కంపెనీ (TSMC) సహా ఇతర తయారీదారులకు ఇది బాగా ఉపయోగపడుతుంది.ఇప్పటివరకు ట్రంప్ సుంకాలు కొన్ని రంగాల్లో 25%గా ఉన్నాయి.అయితే సెమీకండక్టర్లపై ఎంత శాతం ఉంటుందో మాత్రం ఇంకా వెల్లడించలేదు.ఈ విషయంలో వైట్ హౌస్ స్పందించలేదు.ఈ నిర్ణయం టెక్ కంపెనీలకు స్వాగతించదగ్గదే.ముఖ్యంగా గ్లోబల్ సప్లై చైన్‌కు ఇది ఉపశమనం.ట్రంప్ నిర్ణయాలు గ్లోబల్ మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నాయి. కానీ ఈ మినహాయింపుతో టెక్ రంగం కొంతకాలం వరకు ఊపిరి పీల్చుకోనుంది.
Read Also : Donald Trump :శరణార్థి శిబిరంపై ట్రంప్ నిర్ణయాల ప్రభావం