అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ నేడు అధికారికంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భారత కాలమాన ప్రకారం రాత్రి 10:30 గంటలకు ఆయన అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇది మరోసారి ట్రంప్‌కు రాజకీయంగా విజయాన్ని అందించిన చారిత్రక రోజు కానుంది. వాషింగ్టన్ క్యాపిటల్ హాల్లోని రోటుందాలో ఇండోర్ సెటప్‌లో ఈ కార్యక్రమం జరుగుతుంది. అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమైన అమెరికన్ రాజకీయ నేతలు, డిప్లొమాట్లు, మరియు పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు.
ఈ కార్యక్రమానికి భారత ప్రభుత్వం తరఫున విదేశాంగ మంత్రి జై శంకర్ హాజరవుతున్నారు. ట్రంప్ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించడం ద్వారా భారత్-అమెరికా సంబంధాలపై పునరుద్ఘాటన ఉంటుందని భావిస్తున్నారు. జై శంకర్ హాజరుతో ఈ సంబంధాలకు కొత్త దశను అందించే అవకాశాలు ఉన్నాయి.
ట్రంప్ప్రమాణ స్వీకారం సందర్భంగా దేశ ప్రజలకు ప్రసంగం చేసే అవకాశం ఉంది. ఈ ప్రసంగంలో అమెరికా అభివృద్ధి, అంతర్జాతీయ మైత్రి, భద్రతా అంశాలపై ఆయన దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయి. గతంలో తన విధానాలతో వివాదాస్పదంగా నిలిచిన ట్రంప్, ఈసారి కొత్త తీరుతో ముందుకు సాగుతారని అంత భావిస్తున్నారు. ప్రపంచదేశాలు ఈ వేడుక కోసం ఆసక్తిగా గమనిస్తున్నాయి. ట్రంప్ నాయకత్వంలో అమెరికా ఎలా రూపాంతరం చెందుతుందో చూడాలని ప్రజలు ఎదురుచూస్తున్నారు.