పుతిన్ కంటేఅక్రమ వలసదారులతోనే ముప్పు: ట్రంప్

పుతిన్ కంటేఅక్రమ వలసదారులతోనే ముప్పు: ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.అమెరికాకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కంటే అక్రమ వలసదారుల వల్ల ఎక్కువ ముప్పు ఉన్నట్టు ఆయన సోషియల్ మీడియా వేదికగా తెలిపారు.వారిని తిరిగి వారి దేశాలకు పంపించేయాలంటూనే ప్రజలంతా వారితో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అంతేకాకుండా తమ దేశానికి ఐరోపా లాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే పలు జాగ్రత్తలు తీసుకోవాలని వెల్లడించారు. ప్రస్తుతం ట్రంప్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా,ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. 

Advertisements

అక్రమ వలసలపై ట్రంప్ ఆగ్రహం

ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. అనేక దేశాలకు చెందిన అక్రమ వలసదారులను ప్రత్యేక సైనిక విమానాల ద్వారా తిరిగి పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. భారతీయుల్ని కూడా యూఎస్ సైనిక విమానాల ద్వారా తిరిగి ఇక్కడకు పంపించేసింది. ఇప్పటికీ ఈ అక్రమ వలసదారుల బహిష్కరణ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది.అక్రమ వలసదారులను తిరిగి ఇళ్లకు పంపించేస్తున్నారు. అనేక దేశాలకు చెందిన పౌరులను,ప్రత్యేక సైనిక విమానాల ద్వారా వారి దేశాలకు తరలిస్తున్నారు. చేతులకు సంకెళ్లు వేసి మరీ పంపిస్తుండగా పలు దేశాలు ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నాయి. అయినా ఏమాత్రం పట్టించుకోని ట్రంప్అ దే పద్ధతి అనుకరిస్తున్నారు.

అమెరికా-మెక్సికో సరిహద్దు

మెరికా-మెక్సికో సరిహద్దుల్లో అక్రమ వలసలు పెద్ద ఎత్తునే తగ్గినట్లు వెల్లడించారు. ముఖ్యంగా ఫిబ్రవరి నెలలో కేవలం 8 వేల 326 మంది మాత్రమే పట్టుబడ్డారని చెప్పుకొచ్చారు. అదే గత ప్రభుత్వంలో మాత్రం ప్రతినెలా దేశంలోకి 3 లక్షలకు పైగా మందిఅక్రమంగా ప్రవేశించినట్లు గుర్తించామని,అలాగే ఇప్పుడు 95 శాతం వలసలు తగ్గాయని తన పాలనలో ఎవరైనా చట్టవిరుద్ధంగా దేశంలో ప్రవేశిస్తే కఠిన చర్యలతో పాటు పెద్ద మొత్తంలో జరిమానాలు, తక్షణ బహిష్కరణలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

trump putin 650x400 61522134039

రష్యాతో తనకున్న సాన్నిహిత్యంపై వస్తున్న విమర్శలపై ఆదివారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈక్రమంలోనే మాట్లాడుతూ,రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురించి అమెరికా ప్రజలు ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వివరించారు. అలాగే మన దేశంలోకి ప్రవేశించి అత్యాచారానికి పాల్పడే ముఠాలు, డ్రగ్ లార్డ్స్, హంతకులు, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కుంటున్న వారిపై ఎక్కువగా దృష్టి సారించాలని చెప్పారు. ఇలా చేస్తేనే అమెరికా పరిస్థితి ఐరోపాలా మారదని ట్రూత్ సామాజిక మాధ్యమంలో పెట్టిన పోస్టులో వెల్లడించారు.

Related Posts
Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ మరణానంతరం తొలి ఫొటో విడుదల
పోప్ ఫ్రాన్సిస్ మరణానంతరం తొలి ఫొటో విడుదల

పోప్ ఫ్రాన్సిస్ (వయస్సు: 88) సోమవారం ఉదయం కన్నుమూసిన అనంతరం, వాటికన్ అధికారులు ఆయన తొలి ఫోటోను విడుదల చేశారు. ఓపెన్ శవపేటికలో విశ్రాంతి తీసుకుంటున్న పోప్‌ను Read more

పాకిస్థాన్ రైలు హైజాక్ ఘటన : 33 మంది బీఎల్ఏ మిలిటెంట్లు మరణం
pak train hijack

పాకిస్థాన్‌లో సంచలనం సృష్టించిన రైలు హైజాక్ ఘటనకు తెరపడింది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) మిలిటెంట్లు హైజాక్ చేసిన రైలును పాకిస్థాన్ భద్రతా బలగాలు విజయవంతంగా తిరిగి Read more

ప్రజాస్వామ్యానికి గౌరవం ఇవ్వడం అవసరం: బైడెన్
bidn scaled

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్నప్పుడు, అమెరికా ప్రజలకు "శాంతియుత అధికార మార్పిడి" గురించి భరోసా ఇచ్చారు. ఆయన గతంలో డోనాల్డ్ Read more

కేఎల్ యూనివర్సిటీ ,న్యాక్ అధికారులు అరెస్ట్?ఎందుకంటే..
కేఎల్ యూనివర్సిటీ ,న్యాక్ అధికారులు అరెస్ట్ ఎందుకంటే

న్యాక్ రేటింగ్ కొరకు అక్రమాలకు పాల్పడిన కేఎల్ యూనివర్సిటీ అధికారులతోపాటు న్యాక్ పర్యవేక్షణ బృందం సభ్యులను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలోని కోనేరు Read more

Advertisements
×