అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ వార్తల్లోకి వచ్చారు.ఈసారి రెండు అద్భుత నిర్ణయాలతో దేశాన్ని షాక్‌కి గురిచేశారు. ఓదిక్కు విదేశీ సినిమాలపై భారీ సుంకం, మరోవైపు ఆల్కాట్రాజ్ జైలు తిరిగి ప్రారంభం.ఆయన తాజా ప్రకటనలు ‘ట్రూత్ సోషల్’ వేదికగా వెలువడ్డాయి.ట్రంప్ చేసిన మొదటి ప్రకటన సినిమాలపై. విదేశాల్లో తెరకెక్కిన సినిమాలపై ఇకపై 100 శాతం సుంకం విధించనున్నట్లు వెల్లడించారు. అమెరికా చలనచిత్ర పరిశ్రమ వేగంగా క్షీణిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.విదేశాలు అమెరికా స్టూడియోల్ని ఆకర్షిస్తున్నాయని ఆరోపించారు.”ఇది విదేశీ కుట్ర.ఇది జాతీయ భద్రతకే ముప్పు,” అన్నారు ట్రంప్.అందుకే వాణిజ్య శాఖ, యూఎస్ ట్రేడ్ ప్రతినిధులు తక్షణమే చర్యలు ప్రారంభించాలని సూచించారు.

విదేశీ సినిమాలపై ఈ సుంకం హాలీవుడ్‌ని బలోపేతం చేస్తుందని ట్రంప్ అభిప్రాయపడ్డారు.ఈ నిర్ణయంతో హాలీవుడ్‌కు ఊపొచ్చే అవకాశం ఉంది.విదేశీ సినిమాలు అమెరికాలో ప్రదర్శించాలంటే భారీ ఖర్చు అవుతుంది.దీంతో స్థానిక స్టూడియోలు ప్రయోజనం పొందే అవకాశముంది.కానీ విమర్శలు కూడా ఉన్నాయి. విదేశీ చిత్రాలకు టికెట్ ధరలు పెరుగుతాయని ప్రేక్షకులు ఆందోళన చెందుతున్నారు.అంతేకాదు, అమెరికా స్టూడియోలు ఇతర దేశాల్లో తక్కువ ఖర్చుతో సినిమా తీయలేరనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.ఇంకొక సంచలనం ఆల్కాట్రాజ్ జైలుకు సంబంధించింది. ట్రంప్ దీనిని మళ్లీ తెరవాలని అధికారులకు ఆదేశించారు. 1963లో మూసివేసిన ఈ జైలు అప్పట్లో అత్యంత భద్రత గలదిగా పేరొందింది.
ఇప్పుడు మళ్లీ దీనిని ప్రారంభించి విస్తరించాలనే యోచనలో ఉన్నారు. ట్రంప్ మాట్లాడుతూ, “ఇదొకసారి మళ్లీ ప్రమాదకర నేరస్థులకు మట్టి చూపించే జైలు అవుతుంది,” అని అన్నారు.ఈ జైలు మళ్లీ తెరిస్తే, అత్యంత క్రూరమైన నేరస్తులు ఇక్కడ ఉంచబడతారని సూచనలు ఉన్నాయి. ట్రంప్ అమెరికా గంభీరంగా ఉండే రోజులను గుర్తు చేశారు. “ఒకప్పుడు అమెరికా తన శత్రువులను దూరంగా ఉంచేది,” అని అన్నారు.ట్రంప్ నిర్ణయాలు మళ్లీ దేశాన్ని చర్చల్లోకి తీసుకువచ్చాయి. విదేశీ సినిమాలపై సుంకం, ఆల్కాట్రాజ్ తిరిగి తెరవడం అనేది రాజకీయంగా, ఆర్థికంగా ప్రభావం చూపనుంది. ఇది వచ్చే ఎన్నికలకూ ప్రభావం చూపే అవకాశముంది.
Read Also : Air India : హౌతీ మిస్సైల్ దాడి : విమానాలు నిలిపివేసిన ఎయిరిండియా