Donald Trump : విదేశాల్లో నిర్మించే సినిమాలపై 100 శాతం టారిఫ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాషింగ్టన్ టారిఫ్ బాంబుతో ప్రపంచ దేశాలతోపాటు అమెరికన్లనూ అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వణికిస్తున్నారు. ఇప్పటికే సుంకాల మోతతో పలు రంగాలను కుదిపేసిన ఆయన.. సినీ పరిశ్రమనూ వదల్లేదు. విదేశాల్లో చిత్రీకరించి అమెరికాలో విడుదల చేసే సినిమాలపై 100 శాతం టారిఫ్లు విధిస్తున్నట్లు తాజాగా సంచలన ప్రకటన చేశారు. కొందరు హాలీవుడ్ను నాశనం చేస్తున్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని ట్రంప్ వెల్లడించారు. ఈ మేరకు తన ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు.’అమెరికాలో సినీ పరిశ్రమ వేగంగా పతనమవుతోంది. మా దర్శక, నిర్మాతలు, స్టూడియోలను యునైటెడ్ స్టేట్స్ నుంచి దూరం చేసేందుకు ఇతర దేశాలు అన్ని రకాలుగా ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. దీంతో హాలీఫుడ్, ఇతర సినీరంగ విభాగాలు నాశనమవుతుండాయి. ఇతర దేశాలు చేస్తున్న సమష్టి కుట్ర ఇది. దీన్ని దేశ భద్రతకు ముప్పుగా పరిగణించి, అందువల్ల, విదేశీ గడ్డపై నిర్మించమని, మన దేశంలోకి వచ్చే సినిమాలపై 100 శాతం సుంకం విధించే ప్రక్రియను వెంటనే ప్రారంభించేందుకు వాణిజ్య శాఖ, వాణిజ్య ప్రతినిధులకు అధికారాలు ఇస్తున్నా’ అని ట్రంప్ రాసుకొచ్చారు.

Donald Trump : విదేశాల్లో నిర్మించి అమెరికాలో విడుదలయ్యే సినిమాలకు 100% టారిఫ్
దీనిపై అమెరికా వాణిజ్య మంత్రి హోవర్డ్ లుట్నిక్ స్పందిస్తూ ‘మేం దానిపై పనిచేస్తున్నాం’ అని సమాధానమిచ్చారు.అయితే, అమెరికాలో సినిమాలను విడుదల చేసే విదేశీ నిర్మాణ సంస్థలకు ఈ టారిఫ్లు విధిస్తారా? ఓవర్సీస్లో నిర్మించే అమెరికా సినిమాలపై వేస్తారా అన్న దానిపై స్పష్టం లేదు. త్వరలోనే దీనిపై పూర్తి వివరాలు వెల్లడి కానున్నట్లు తెలియజేశారు.ప్రస్తుతం సినిమాలను వస్తువుగా కాకుండా మేధో సంపత్తిగా పరిగణిస్తుండటంతో వీటిపై ఎలాంటి టారిఫ్లు విధించడం లేదు. అయితే, హాలీవుడ్ వెలువల షూటింగ్లు చేసే సినిమాలు, టెలివిజన్ కార్యక్రమాలకు కొన్ని నగరాలు భారీ ఎత్తున పన్ను మినహాయింపులు కల్పిస్తున్నాయి.దీంతో ఇటీవల కాలంలో చాలా నిర్మాణ సంస్థలు తమ కార్యకలాపాలను హాలీ వుడ్ నుండి టొరంటో (కెనడా), డబ్లిన్ (ఐర్లాండ్) వంటి నగరాలకు తరలించాయి.
Read More : PM Modi: ప్రధాని మోదీతో రక్షణ కార్యదర్శి కీలక భేటీ