అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మెట్ల (staircase)పై నుంచి జారి పడిపోబోయారు.

న్యూజెర్సీ (New Jersey)లోని మోరిస్టౌన్‌లో గల మోరిస్టౌన్ మున్సిపల్ ఎయిర్‌పోర్ట్ (Morristown Municipal Airport)లో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడి నుంచి బయల్దేరే సమయంలో ఎయిర్ ఫోర్స్ వన్ (Air Force One) ఎక్కుతున్న ట్రంప్.. ఒక్కసారిగా మెట్లపై అదుపుతప్పారు. అయితే వెంటనే కోలుకుని పైకి లేచారు. రెయిలింగ్‌ను పట్టుకుని లేచి విమానంలోకి ఎక్కేశారు. ఈ ఘటనలో అధ్యక్షుడికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.
అధ్యక్షుడిగా ఉండటానికి అనర్హుడు
ట్రంప్‌తోపాటు ఎయిర్‌ఫోర్స్ వన్ ఎక్కేటప్పుడు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియో కూడా తడబడ్డారు. అధ్యక్షుడు ట్రంప్ కిందపడిపోబోతున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. గత అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden)తో ట్రంప్‌ను పోలుస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ‘ఇదే బైడెన్ అయ్యి ఉంటే ఈపాటికి మీడియా నెట్‌వర్క్‌లో బిగ్ బ్రేకింగ్ న్యూస్ వచ్చేది’, ‘ట్రంప్ మెట్లు ఎక్కలేకపోతున్నారు.. ఆయన అధ్యక్షుడిగా ఉండటానికి అనర్హుడు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, గత అధ్యక్షుడు (US President) జో బైడెన్ (Joe Biden) చాలాసార్లు ఎయిర్‌ఫోర్స్ వన్ విమానం ఎక్కుతూ కిందపడిపోబోయిన విషయం తెలిసిందే.
Read Also:Pakistan: ఆత్మరక్షణకు ఆయుధాలివ్వండి..అమెరికాను కోరిన పాకిస్తాన్..!