అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి గెలిచిన తర్వాత కూడా ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఆగడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న జెఫ్రీ ఎల్టీన్ (Jeffrey Eltin) సెక్స్ కుంభకోణం పైల్స్ విడుదల చేస్తానంటూ ఇచ్చిన హామీ ట్రంప్ (Donald Trump) మెడకే చుట్టుకుంటోంది. ఈ ఉదంతంపై కొన్ని దశాబ్దాల క్రితమే దర్యాప్తు చేయాలని కోరిన అమెరికన్ కళాకారిణి మారియా ఫార్మర్ ట్రంప్ పై సంచలన ఆరోపణలు చేశారు. ఓ సందర్భంగా ట్రంప్ తనకు ఎదురుపడగా అసభ్యకరంగా చూశారని పేర్కొన్నారు.

అసలేం జరిగిందో ఆమె మాటల్లోనే..
ఆనాటి చేదు అనుభవాన్ని మారియా న్యూయార్క్ టైమ్స్ పత్రికతో పంచుకొన్నారు. 1995లో తాను ఎన్ కోసం పనిచేయడానికి సిద్ధమవుతున్నానని, ఒకరోజు బాగా పొద్దుపోయాక ఎప్లిన్ ఫోన్ చేసి తనను మాన్హట్టన్ (Manhattan)లోని ఆఫీసులో కలవాలని ఫోన్ చేసినట్లు తెలిపారు. తాను రన్నింగ్ షార్ట్స్ ధరించే ఆఫీస్కు వెళ్లినట్లు చెప్పారు. అదే సమయంలో ట్రంప్ బిజినెస్ సూట్ ధరించి
అక్కడికి వచ్చారని గుర్తు చేసుకున్నారు. తనకు సమీపంలోనే ట్రంప్ (Donald Trump) నిలబడి వేచి చూస్తున్నారని చెప్పారు. ఈ క్రమంలో ట్రంప్ తన కాళ్లవైపు అదేపనిగా చూడటాన్ని గమనించినట్లు చెప్పారు. ఆ సమయంలో తనకు భయం వేసినట్లు మారియా పేర్కొన్నారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఎప్లిన్ ‘నో..నో.. ఆమె నీకోసం కాదు’ అంటూ ట్రంప్ను అక్కడి నుంచి తీసుకెళ్లారన్నారు. ఆ సమయంలో తనకు 16 ఏళ్లు ఉంటాయని అనుకొన్నట్లు ట్రంప్ వ్యాఖ్యానించారన్నారు. వాస్తవానికి అప్పటికే మారియా వయసు 20లో ఉంది.
స్పందించిన వైట్ హౌస్
ఈ వ్యాఖ్యలపై వైట్ హౌస్ స్పందించింది. ఎప్టాన్ తో స్నేహాన్ని ట్రంప్ వదిలేసి చాలాకాలం అవుతోందని పేర్కొంది. అధ్యక్షుడు ఏనాడూ ఎపిస్టీన్ ఆఫీస్కు వెళ్లలేదని పేర్కొంది. మారియా 1996లోనే ఎపీ స్టీన్, మ్యూక్స్ వెల్ సెక్ ట్రాఫికింగ్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. 2006లో కూడా ఎఫ్బీఐ ఇంటర్వ్యూలో ట్రంప్ పేరును మరోసారి మారియా ప్రస్తావించారు. ఈ కేసు ప్రస్తుతం
ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ట్రంప్పై విచారణ జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ట్రంప్ వలస పాలనపై కఠినవైఖరిని అవలంభించడం వల్ల ఏవిధంగానైనా విదేశీయుల సంఖ్య తగ్గించే ప్రయత్నంలో ఉన్నారు. అంతేకాక టారిఫ్లతో ప్రపంచదేశాలతో ట్రేడ్వారు ట్రంప్ బీజం వేస్తున్నారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఈ తరుణంలో ట్రంప్పై
ఇలాంటి ఆరోపణలు రావడంతో భవిష్యత్తులో దీనిపై ట్రంప్ ఏవిధంగా స్పందించి, చర్యలు తీసుకుంటారో వేచిచూడాలి .
Read hindi news: hindi.vaartha.com
Read also: Hackers: హ్యాకర్ల దెబ్బకు అంధకారంలో 700 మంది ఉద్యోగుల భవిత