RevanthReddy :మోదీకి సీఎం రేవంత్ లేఖ ఎందుకో తెలుసా!

RevanthReddy :మోదీకి సీఎం రేవంత్ లేఖ ఎందుకో తెలుసా!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముప్పై మూడోసారి హస్తినకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లులకు కేంద్ర మద్దతు కోరాలని నిర్ణయించారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ప్రధానికి లేఖ రాశారు. అఖిలపక్ష ప్రతినిధులతో కలిసి ప్రధానిని కలవాలన్న అభ్యర్థనను లేఖలో పేర్కొన్నారు.

Advertisements

బీసీ రిజర్వేషన్ల పెంపు

బీసీ రిజర్వేషన్ల బిల్లుకు కేంద్ర మద్దతు కోరారు. విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ అసెంబ్లీలో రెండు బిల్లులకు ఆమోద ముద్ర పడింది. పార్లమెంట్‌ ఆమోదం పొందేలా కలిసి కట్టుగా కృషి చేసేందుకు అఖిలపక్షాలు సంసిద్దమయ్యాయి.తెలంగాణలో ఇప్పుడు విద్యా సంస్థలు, ఉద్యోగాల్లో , షెడ్యూల్‌ కులాలు 15 శాతం, షెడ్యూల్‌ తెగలు 7శాతం, మైనార్టీలు 4 శాతం, BCలకు 23 శాతం రిజర్వేషన్లు వున్నాయి. ఐతే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులగుణ నివేదిక ప్రకారం బీసీలు 56.36 శాతం . ఆ మేరకు రిజర్వేషన్ల పెంపుఆవశ్యకతను వివరిస్తూ కేంద్ర మద్దతు కోరనుంది అఖిలపక్షం,అపాయింట్‌మెంట్‌ కోరుతూ మోదీకి లేఖ వెళ్లింది. ఇక ప్రధాని కార్యాలయం నుంచి పిలుపే తరువాయి అఖిలపక్షం ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలవనుంది.

చర్లపల్లి రైల్వే టెర్మినల్ స్టేషన్ పేరు మార్పు

సీఎం రేవంత్ రెడ్డి కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్​కు మరో లేఖ రాశారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ స్టేషన్ పేరును “పొట్టి శ్రీరాములు చర్లపల్లి రైల్వే టెర్మినల్ స్టేషన్” గా మార్చాలని కోరుతూ కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ కు సీఎం లేఖ రాశారు. తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్​ రెడ్డి పేరును పెట్టడంతో,పొట్టి శ్రీరాములు పేరును చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు పెట్టాలని సీఎం రేవంత్​ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.

ఈ రెండు ప్రధాన అంశాలపై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సి ఉంది. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల పెంపుపై కేంద్రం సానుకూలంగా స్పందిస్తే, తెలంగాణలో సామాజిక న్యాయ పరిరక్షణకు మరింత ఊరట లభించనుంది.

Related Posts
Medicines: పెరిగిన మందుల ధరలు..900కి పైగా ఔషధాలపై ప్రభావం
పెరిగిన మందుల ధరలు..900కి పైగా ఓషధాలపై ప్రభావం

మీరు రోజూ మందులు వేసుకుంటుంటారా.. అయితే మీ మందుల ఖర్చులు కాస్త పెరగనున్నాయి. ఎందుకంటే నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA) అవసరమైన మందుల ధరలను 1.74% Read more

Telangana : జపాన్ పారిశ్రామికవేత్తలకు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం
Telangana : జపాన్ పారిశ్రామికవేత్తలకు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం

Telangana : టోక్యో, ప్రభాతవార్త: జపాన్ పారిశ్రామిక, వ్యాపారవేత్తలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానం తెలిపారు. తెలంగాణ రాష్ట్రం గురించి వివరించిన Read more

అక్కినేని నాగేశ్వరరావుని ప్రశంసించిన మోదీ
అక్కినేని నాగేశ్వరరావుని ప్రశంసించిన మోదీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు ప్రసారం చేసిన "మన్ కీ బాత్" కార్యక్రమంలో తన 117వ ఎపిసోడ్‌లో అక్కినేని నాగేశ్వరరావు, బాలీవుడ్ దిగ్గజాలు రాజ్ Read more

త్వరలో అంతరిక్ష కేంద్రం సిద్ధం
indian space station 181852770 16x9

ఇండియా సైన్స్ అండ్ టెక్నాలజీలో వేగంగా డెవలప్ అవుతుంది. అందులో భాగంగా భారతదేశం 2035 నాటికి సొంతంగా అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేసుకోనుందని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×