biggboss final

బిగ్ బాస్-8 గ్రాండ్ ఫినాలేకు గెస్ట్ ఎవరో తెలుసా..?

నార్త్ లో సూపర్ సక్సెస్ సాధించిన బిగ్ బాస్ రియాల్టీ షో..సౌత్ లో కూడా అంతే ఆదరణ పొందుతుంది. అయితే తెలుగు విషయానికి వస్తే గత సీజన్ ఎంతగానో అలరించగా..ఈ సీజన్ మాత్రం ప్లాప్ అయ్యిందనే చెప్పాలి. మొదటి నుండి పెద్దగా TRP రేటింగ్ సాధించలేకపోయింది. బిగ్ బాస్ యాజమాన్యం ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఆడియన్స్ మాత్రం పెద్దగా ఇంట్రస్ట్ చూపించలేదు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ షో చివరి వారానికి చేరుకుంది. ఈ వారం తో బిగ్ బాస్ సీజన్ 08 పూర్తి అవుతుంది.

Advertisements

బిగ్‌బాస్ సీజన్-8 గ్రాండ్ ఫినాలే వచ్చే ఆదివారం జరగనుంది. ఈ కార్యక్రమం కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 105 రోజుల పాటు కొనసాగిన ఈ కార్యక్రమంలో పార్టిసిపెంట్స్ మధ్య గేమ్‌లు, ఎమోషనల్ డ్రామాలు ప్రేక్షకుల్ని పర్వాలేదు అనిపించాయి. ఇదిలా ఉండగా పుష్ప-2తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన అల్లు అర్జున్ ఈ గ్రాండ్ ఫినాలేకు ముఖ్య అతిథిగా హాజరవుతారనే వార్తలు షికారు చేస్తున్నాయి. ఆయనే విజేతకు ట్రోఫీ అందజేస్తారని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ, ఈ వార్తలు అభిమానులను మరింత ఉత్సాహపరుస్తున్నాయి. అల్లు అర్జున్ వంటి స్టార్ బిగ్‌బాస్ ఫినాలేకు రాకతో ఈ ఈవెంట్‌కు మరింత క్రేజ్ వస్తుందని నమ్మకంగా ఉంది.

ఇప్పటికే టాప్-5 ఫైనలిస్టులు అవినాశ్, నిఖిల్, ప్రేరణ, గౌతమ్, నబీల్‌గా నిలిచారు. వీరిలో ఎవరు విజేతగా నిలుస్తారన్నదే ఇప్పుడు అందరి ప్రశ్న. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తమ ఫేవరెట్ కంటెస్టెంట్‌ను మద్దతు ఇస్తూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఎవరు విజేత అయినా, ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో వీరంతా సక్సెస్ అయ్యారని చెప్పాలి. బిగ్‌బాస్ హౌస్‌లోని ప్రతి కంటెస్టెంట్ తనదైన ఆటతీరు, ఎమోషన్స్, ఆలోచనలతో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. విజేత ఎంపికలో ప్రేక్షకుల ఓటింగ్ కీలక పాత్ర పోషించనుంది. అందుకే ఈసారి ఎవరు గెలుస్తారన్నది అంచనా వేయడం చాలా కష్టం. ప్రతి ఒక్కరూ అత్యద్భుతంగా ఆటలో నైపుణ్యాలను ప్రదర్శించారు.

Related Posts
బడ్జెట్ 2025: ఆదాయపు పన్ను మినహాయింపు ఎప్పుడు?
బడ్జెట్ 2025: ఆదాయపు పన్ను మినహాయింపు ఎప్పుడు?

గత కేంద్ర బడ్జెట్‌లో పాత పన్ను విధానంలో మార్పులు చేయకుండా, కొత్త పన్ను విధానంలో కొన్ని ఆకర్షణీయమైన మార్పులను ప్రవేశపెట్టింది. ఆదాయపు పన్ను మినహాయింపులు పొందడానికి జీతాలు Read more

రేవంత్ ను మెంటల్ ఆసుపత్రిలో చేర్చాలి – కేటీఆర్
విషాదంలోనూ మంత్రులు వినోదాలు:కేటీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రతిపక్షాల మరణాన్ని కోరుకోవడం రాజకీయాల్లో నీచమైన చర్య అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ Read more

Ration shops : ఏపీలో రేషన్‌లో రాగులు.. జూన్ నుంచి పంపిణీ రేషన్‌ షాపులు
Ragi in ration in AP.. Distribution ration shops from June

Ration shops : ఏపీ ప్రభుత్వం రేషన్‌ లబ్ధిదారులకు బియ్యం, పంచదార, కందిపప్పు, గోధుమ పిండితో పాటుగా తృణధాన్యాలను కూడా పంపిణీ చేయాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా వచ్చే Read more

భారతీయ వలసదారుల పట్ల భారత్ ఏమి చేయబోతుంది?
indian immigrants in us.

అమెరికా లో ఉంటున్న అక్రమ వలసదారులను ట్రంప్ ప్రభుత్వం వెనక్కి పంపుతోంది. ఇప్పటికే 104 మంది భారతీయులను అమెరికా మిలటరీ విమానం C-17 మోసుకొచ్చింది. మరింతమందిని వెనక్కి Read more

×