Health:చూయింగ్‌ గమ్‌ తినడం వల్ల ఎంత డేంజరో తెలుసా..!

Health:చూయింగ్‌ గమ్‌ తినడం వల్ల ఎంత డేంజరో తెలుసా..!

చూయింగ్ గమ్‌ను ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది తింటుంటారు. పిల్లలనుండి పెద్దల వరకు చాలా మందికి ఇది అలవాటుగా మారింది. అయితే, తాజా పరిశోధనల ప్రకారం, చూయింగ్ గమ్‌లో మైక్రోప్లాస్టిక్స్ ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.ఊరికే సరదాగా నములుతూ ఉంటారు. ఇలా చూయింగ్ గమ్‌ నమలడం అలవాటు ఉన్న వాళ్ల ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాలి. చూయింగ్‌ గమ్‌ తినే వాళ్లు ప్లాస్టిక్‌ను తింటున్నట్లే అంటున్నారు నిపుణులు. లాస్‌ ఏంజిల్స్‌లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం ఇటీవల చేసిన పరిశోధన ప్రకారం చూయింగ్‌ గమ్ నమలడం వల్ల, మీకు తెలియకుండానే కొన్ని వేల మైక్రో ప్లాస్టిక్ ముక్కలను మింగుతున్నట్లు తేలింది. ఈ మైక్రోప్లాస్టిక్‌లు మీ నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తాయి.

Advertisements

మైక్రో ప్లాస్టిక్‌

సాధారణంగా చూయింగ్‌ గమ్‌ను చెట్టు రసం నుంచి తయారు చేస్తారు. అవి చాలా సురక్షితం. కానీ, కొన్ని కంపెనీలు తయారు చేస్తున్న చూయింగ్‌ గమ్‌లో మైక్రో ప్లాస్టిక్‌ ఉన్నట్లు శాస్త్రేవేత్తలు కనిపెట్టారు. నేడు చాలా చూయింగ్ గమ్‌లలో ప్లాస్టిక్ సంచులు, జిగురులలో తరచుగా ఉపయోగించే పాలిథిలిన్, పాలీ వినైల్ అసిటేట్ వంటి సింథటిక్ పాలిమర్‌లు ఉంటున్నాయి. ఇలాంటి చూయింగ్‌ గమ్‌లను నమిలినప్పుడు వేలాది చిన్న ప్లాస్టిక్ కణాలు శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఇదే విషయాన్ని గురుగ్రామ్‌లోని ఆర్టెమిస్ హాస్పిటల్‌లోని న్యూరోసర్జరీ అండ్‌ సైబర్‌నైఫ్ డైరెక్టర్ డాక్టర్ ఆదిత్య గుప్తా కూడా చెప్పారు.

Homemade Bubble Gum imperial 1

నాడీ వ్యవస్థ

మైక్రోప్లాస్టిక్ కణాలు పేగు లైనింగ్ వంటి జీవసంబంధమైన అడ్డంకులను, కొన్ని సందర్భాల్లో రక్తం, మెదడుకు హాని చేస్తాయంట. నాడీ వ్యవస్థపై మరింత తీవ్రమైన ప్రభావం చూపుతాయని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం వెల్లడైన అధ్యయనంలో, ప్రతి గ్రాము గమ్ నుండి 100 మైక్రోప్లాస్టిక్‌లు విడుదలవుతున్నాయని తేలింది. కొన్ని ఉత్పత్తులు గ్రాముకు 600 మైక్రోప్లాస్టిక్‌లను విడుదల చేస్తాయి.పేగుల ఆరోగ్యంపై ప్రభావం – మైక్రోప్లాస్టిక్‌లు పేగుల గోడలను దాటి రక్తప్రవాహంలోకి వెళ్లే ప్రమాదం ఉంది.మెదడుపై ప్రభావం – ఇవి కొన్ని సందర్భాల్లో మెదడును ప్రభావితం చేసి నాడీ సంబంధిత వ్యాధులకు దారి తీసే అవకాశం ఉంది.చూయింగ్ గమ్ తినడం చాలా మందికి అలవాటుగా మారింది. అయితే, ఇందులో మైక్రోప్లాస్టిక్స్ ఉండటం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముందని తాజా అధ్యయనాలు స్పష్టం చేశాయి. నాడీ వ్యవస్థ, మెదడు ఆరోగ్యం, పేగుల పనితీరుపై ప్రతికూల ప్రభావాన్ని చూపే ప్రభావం ఉంది,కాబట్టి ప్రజలు ఈ అలవాటును మానుకోవడం మంచిది.

Related Posts
ఈ జ్యూస్ తో మరిన్ని ప్రయోజనాలు..
carrot juice

ప్రతిరోజూ ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్ తాగితే, మీ శరీరంలో అద్భుతమైన ఫలితాలు కనిపించడం ఖాయం. ఇది ఆరోగ్యానికి అత్యంత లాభకరమైన ఆహారం, ముఖ్యంగా మీకు కావలసిన Read more

బ్లాక్ కాఫీ తాగడం వల్ల ఎన్నిలాభాలో తెలుసా!
బ్లాక్ కాఫీ తాగడం వల్ల ఎన్నిలాభాలో తెలుసా!

బ్లాక్ కాఫీ అనేది కేవలం ఒక అలవాటు మాత్రమే కాకుండా, ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించే సూపర్ డ్రింక్. రోజూ తగిన పరిమాణంలో బ్లాక్ కాఫీ Read more

ప్రతిరోజూ తులసి నీళ్లను తాగి ఆరోగ్యంగా ఉండండి
tulasi water

తులసి నీళ్లను రోజూ తాగడం అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. తులసి, భారతీయ వైద్య శాస్త్రంలో ప్రముఖమైన ఔషధ మొక్క. దీనిలో అనేక పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్, Read more

Black Chickpeas: ఆరోగ్య ‘సిరి’..నల్ల శనగలు
Black Chickpeas: ఆరోగ్య 'సిరి'..నల్ల శనగలు

నల్ల శనగలు మన శరీరానికి ఎంతో ఉపయోగకరమైన ఆహారం. ఇవి శరీరానికి శక్తిని పెంచి, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. నల్ల శనగలు మన శరీరానికి కావలసిన అనేక పోషకాలు Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×