వాల్‌నట్స్‌పోషక విలువలు అధికంగా ఉండే డ్రైఫ్రూట్స్‌లో ఒకటి. ఇవి శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు అందించడంలో సహాయపడతాయి. వాల్‌నట్స్‌ను రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలుంటాయి.
వాల్‌నట్స్ వల్ల ఉపయోగాలు
వాల్‌నట్స్ ఆకారం మన మెదడును పోలి ఉంటుంది, ఇదేలా కాకుండా వీటి ప్రయోజనాలు కూడా మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచేలా ఉంటాయి. వీటిలో అధికంగా ఉండే ఒమేగా-3 ఫ్యాటి యాసిడ్స్ మెదడు పనితీరును మెరుగుపరిచేలా సహాయపడతాయి. మతిమరుపు, అల్జీమర్స్ వంటి సమస్యలను నివారించడంలో వాల్‌నట్స్ ఉపయుక్తంగా ఉంటాయి.వాల్‌నట్స్ లో మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు అధికంగా ఉండడం వల్ల ఇవి గుండెకు చాలా మంచివి. రోజూ వాల్‌నట్స్ తినడం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయులను తగ్గించుకోవచ్చు. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు రక్తనాళాల్లో మాలినాలను తొలగించి గుండె సంబంధిత వ్యాధులను అరికట్టుతాయి.మహిళల్లో (పోలీసైస్టిక్ ఓవరీ సిండ్రోమ్ ), హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలను వాల్‌నట్స్ తగ్గించగలవు. ఇవి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి, హార్మోన్ల సమతుల్యతను మెరుగుపరిచేందుకు సహాయపడతాయి.వాల్‌నట్స్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది మన కడుపును త్వరగా నింపేలా చేసి ఆకలిని నియంత్రిస్తుంది.

వాల్‌నట్స్ ఎక్కువగా తినడం వల్ల కలిగే నష్టాలు
వాల్‌నట్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయని చెప్పినా, ఇవి అధిక స్థాయిలో తీసుకుంటే కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.జీర్ణ సమస్యలు,ఎక్కువ వాల్‌నట్స్ తినడం వల్ల కడుపులో ఉబ్బరం, గ్యాస్ సమస్యలు వస్తాయి.కొందరికి డయేరియా సమస్య కూడా ఏర్పడే అవకాశం ఉంది.ఎలర్జీ సమస్యలుకొంతమందికి వాల్‌నట్స్ తిన్న వెంటనే చర్మంపై దురద, వాపు, మంట వంటి సమస్యలు తలెత్తవచ్చు.శ్వాసకోశ సంబంధిత సమస్యలు కూడా ఏర్పడే అవకాశం ఉంది.బరువు పెరగడం,వాల్‌నట్స్ ఎక్కువగా తింటే అధిక క్యాలరీలు శరీరంలో చేరి బరువు పెరగడానికి కారణమవుతాయి.బరువు తగ్గాలని అనుకునే వారు వాల్‌నట్స్‌ను పరిమితంగా తినాలి.కిడ్నీ సమస్యలు,అధికంగా వాల్‌నట్స్ తినడం వల్ల ఆక్సలేట్ స్థాయిలు పెరిగి, కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంటుంది.అతిగా తినడం వల్ల ఛాతిలో మంట,అధికంగా తింటే ఛాతిలో మంట, అజీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.వాల్‌నట్స్ ఆరోగ్యానికి మంచివే అయినా, రోజు 4-5 వాల్‌నట్స్ తినడం మంచిది. వీటిని అధికంగా తింటే ఆనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశముంది. ఎవరైనా ఎలర్జీ, గుండె సంబంధిత వ్యాధులు, లేదా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారు, డాక్టర్ సూచనల మేరకు మాత్రమే వీటిని తీసుకోవడం ఉత్తమం.