భోజనం అనంతరం కొంత సమయం నడవడం ఆరోగ్యానికి ఎంతో మేలుకలిగిస్తుంది. వైద్యుల సూచనల ప్రకారం, రాత్రి భోజనం తర్వాత కనీసం 10 నిమిషాలు నడవడం జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. ఇది కేవలం జీర్ణవ్యవస్థకే కాకుండా, రక్త ప్రసరణను మెరుగుపరిచేలా సహాయపడుతుంది.
గోరు వెచ్చని నీళ్లు తాగడం
తిన్న తర్వాత గోరు వెచ్చని నీళ్లు తాగడం పేగుల పనితీరును మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. ఇది ఆహారం త్వరగా జీర్ణమవడానికి, శరీరంలోని విష పదార్థాలు తొలగించడానికి సహాయపడుతుంది. కడుపులో గ్యాస్ సమస్యలు, ఎసిడిటీ వంటి సమస్యలు తక్కువయ్యే అవకాశం ఉంటుంది.

పడుకోవడానికి ముందు తగిన విరామం
భోజనం తిన్న వెంటనే పడుకోవడం జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. కనీసం 30 నిమిషాల పాటు నిటారుగా కూర్చోవడం లేదా చిన్నగా నడవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఇలా చేస్తే గ్యాస్, ఎసిడిటీ సమస్యలు దూరమవుతాయి.
సోంపు లేదా వాము నమిలితే ప్రయోజనం
భోజనం తర్వాత సోంపు లేదా వాము నమిలితే జీర్ణక్రియ మెరుగవుతుంది. ఇవి పొట్టను హాయిగా ఉంచి, మలబద్ధకాన్ని తగ్గించే గుణాలను కలిగి ఉంటాయి. ఇది కడుపు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన జీవనశైలికి రాత్రి భోజనం తర్వాత సరైన అలవాట్లు పాటించడం చాలా ముఖ్యం.