తమిళనాడులోని మదురైలో జరిగిన ‘మురుగన్ మానాడు’ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) గంభీరంగా స్పందించారు. మతాన్ని రాజకీయాల కోసం ఉపయోగించడం సరికాదని, హిందుత్వాన్ని ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకోవద్దని డీఎంకే నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.మదురైలో ఆదివారం జరిగిన మానాడులో పవన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌పై (On MK Stalin) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్యక్రమం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మానాడును రాజకీయ లాభాల కోసం వాడుకోవడం తగదు. మా మతాన్ని మీరెవరు ప్రశ్నించేది? అంటూ డీఎంకే నేతలపై కౌంటర్ వేశారు. హిందువు హిందువుగా ఉండకూడదా? ప్రశ్నిస్తే సెక్యులరిజం అంటారా? అని ధ్వజమెత్తారు.

హిందువులను రెచ్చగొట్టే ప్రయత్నం మానేయండి
దయచేసి హిందువుల మనోభావాలను గాయపర్చే వ్యాఖ్యలు చేయకండి. మతంపై అవమానకర వ్యాఖ్యలు చేస్తే ప్రశ్నించడం సహజం. అప్పుడు మా ప్రశ్నలకు సెక్యులరిజం పేరుతో సమాధానం చెప్పడం ఎందుకు? అని పవన్ నిలదీశారు. ప్రజల విశ్వాసాలను గౌరవించాలే తప్ప, రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్దేశపూర్వకంగా విమర్శించడం సరికాదని తెలిపారు.
మదురై పర్యటనలో పవన్ – పూజలు, ప్రసంగం
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ తిరుపరకుండ్రం సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాన్ని సందర్శించారు. అనంతరం మురుగన్ మానాడు సభలో ప్రసంగించారు. ఆయన ప్రసంగంలో హిందూ సంస్కృతిని గౌరవించాలని, మతం పై రాజకీయాలేమీ జరగకూడదని స్పష్టం చేశారు.
బీజేపీ నేతల భారీ స్వాగతం
ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు పవన్‌కు ఘనస్వాగతం తెలిపారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, పొంగులేటి సుధాకర్ రెడ్డి, చక్రవర్తి, అమర్ ప్రసాద్ రెడ్డి, రామ శ్రీనివాసన్ తదితరులు పాల్గొన్నారు. జనసేన నేతలు కూడా ఈ వేడుకలో పాలుపంచుకున్నారు.
Read Also : Sourav Ganguly : భారత జట్టు కోచ్ బాధ్యతలపై సంకేతాలు : గంగూలీ