Distribution of Chandrababu pensions in Yalamanda

యలమందలో చంద్రబాబు పింఛన్ల పంపిణీ

అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబు పల్నాడు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ మేరకు ఆయన యల్లమందలోని పింఛను పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్ధిదారులకు ఇళ్లకు వెళ్లి సీఎం స్వయంగా పింఛను అందజేశారు. శారమ్మ అనే మహిళ ఇంటికి వెళ్లిన సీఎం పింఛను నగదు ఇచ్చి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. శారమ్మ కుమార్తెకు నీట్‌ కోచింగ్‌ ఇప్పించాలని సీఎం అధికారులకు సూచించారు. శారమ్మ కుమారుడికి ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా రుణం ఇప్పించాలని ఆదేశించారు. దూర విద్య ద్వారా చదువు కొనసాగించాలని శారమ్మ కుమారుడికి సూచించారు.

Advertisements

ఆ తర్వాత సీఎం చంద్రబాబు మరో లబ్ధిదారుడు ఏడుకొండలు ఇంటికి వెళ్లారు. ఏడుకొండలు ఇంట్లో చంద్రబాబు స్వయంగా కాఫీ తయారు చేశారు. తాను పెట్టిన కాఫీని ఏడుకొండలు కుటుంబ సభ్యులకు ఇచ్చారు. అనంతరం ఏడుకొండలు కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. దుకాణం పెట్టుకునేందుకు కుటుంబానికి బీసీ కార్పొరేషన్‌ ద్వారా 5 లక్షల రుణం ఇవ్వాలని ఆదేశించారు.

కాగా, ఒకటో తేదీకి ఒకరోజు ముందుగానే ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లను అందిస్తోంది. ఈ ఉదయం నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. 63,77,943 మంది లబ్ధిదారులకు పింఛన్ల కోసం రూ. 2,717 కోట్లను విడుదల చేసింది. ఈ ఉదయం నుంచి ఇప్పటి వరకు 90 శాతం మందికి పింఛన్లను పంపిణీ చేశారు.

Related Posts
BRICS Pay: స్వదేశీ కరెన్సీలతో అంతర్జాతీయ చెల్లింపులకు సులభతరం
brics pay

రష్యాలో ఇటీవల జరిగిన BRICS సమ్మిట్‌లో, రష్యా "BRICS Pay" అనే చెల్లింపుల వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఈ కొత్త చెల్లింపుల వ్యవస్థ, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంబంధాలను మరింత Read more

hamas israel war :ఇజ్రాయెల్-హమాస్ మధ్య మళ్లీ ఘర్షణలు: 70 మంది మృతి
ఇజ్రాయెల్-హమాస్ మధ్య మళ్లీ ఘర్షణలు: 400 మందికి పైగా మృతి

పశ్చిమాసియా మరోసారి యుద్ధ వాతావరణాన్ని ఎదుర్కొంటోంది. ఇజ్రాయెల్-హమాస్ మధ్య మరింత ఉద్రిక్తత పెరిగింది. ఇటీవలి ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 400 మందికి పైగా మృతి చెందారు. తాజాగా Read more

పాపం కర్ణాటక సీఎంకు అసలు సొంత ఇల్లే లేదట..
karnataka cm siddaramaiah

కర్ణాటక సీఎం సిద్దరామయ్య ముడా స్కాం విషయంలో తనపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు. ఆయన తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ నిజాయతీతో పనిచేశానని, అవినీతి Read more

నామినేషన్ వేసిన నాగబాబు
నామినేషన్ వేసిన నాగబాబు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోటా నామినేషన్: జనసేన నేత కొణిదెల నాగబాబు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త బలపరిచే అభ్యర్థులుగా జనసేన పార్టీ ముందు వెలుగులో నిలిచిన కొణిదెల నాగబాబు, Read more

×