విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్. ఇక థాయ్‌లాండ్ వెళ్లాలంటే కనెక్టింగ్ ఫ్లైట్ ఎక్కాల్సిన పనిలేదు. హైదరాబాద్ నగరం నుంచి నేరుగా థాయ్‌లాండ్ చేరుకోవచ్చు. ఈ మేరకు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి థాయ్‌లాండ్‌కు నేరుగా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన సర్వీసులు ప్రారంభించారు. శంషాబాద్ నుంచి థాయ్‌లాండ్‌లోని ఫుకెట్ నగరానికి తొలి డైరెక్ట్ ఫ్లైట్ శుక్రవారం (జనవరి 31) బయలుదేరింది. ఈ విషయాన్ని జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్ సీఈఓ ప్రదీప్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ కొత్త ఎయిర్ ఇండియా సర్వీసు ద్వారా థాయ్‌లాండ్ లోని ఫుకెట్ – హైదరాబాద్ నగరాల మధ్య ప్రయాణ సౌకర్యం మరింత మెరుగుపడుతుందని ప్రదీప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఫ్లైట్ 3.45 గంటల్లోనే గమ్యస్థానానికి చేరుకుంటుందని వెల్లడించారు.

ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్ సర్వీసులు ప్రస్తుతం వారంలో ప్రతి బుధ, శుక్ర, ఆదివారాల్లో నడుస్తాయని చెప్పారు. ఈనెల 15 నుంచి వారానికి ఆరు విమానాలకు పెంచుతామని ప్రదీప్ తెలిపారు. హైదరాబాద్ – ఫుకెట్ మధ్య నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించిన మొదటి విమానయాన సంస్థగా నిలవడం సంతోషంగా ఉందని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ మేనేజింగ్ డైరెక్టర్ అలోక్ సింగ్ వెల్లడించారు.
సాధారణ రోజుల్లో విమాన టికెట్ రూ.7 వేలు ఉండగా… ప్రస్తుతం రూ.20వేల వరకు ఉంది. ప్రయాగ్‌రాజ్ కుంభమేళాకు హైదరాబాద్ నుంచి విమానసర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. విమాన సర్వీసుల టికెట్ ధరలను పరిశీలిస్తే.. ఫిబ్రవరి 2 నుంచి ఫిబ్రవరి 16 వరకు కనిష్ఠంగా రూ.20,552 నుంచి రూ.33,556 వరకు టికెట్ ధరలు ఉన్నాయి. ఈ ధరలకు అదనంగా ట్యాక్సులు ఉంటాయని తెలిపారు. కొన్ని విమానయాన సంస్థలు ప్రయాణికులకు భోజనం, టిఫిన్ సౌకర్యాలు కూడా అందిస్తున్నాయి.