హైదరాబాద్ నగరం మిస్ వరల్డ్ 2025 (Miss World 2025) పోటీలకు వేదికవడం గర్వకారణంగా మారింది. ప్రపంచంలోని 109 దేశాల సుందరీమణులు గత వారం రోజులుగా హైదరాబాద్(Hyderabad)లో సందడి చేస్తూ పలు పర్యాటక ప్రాంతాలను దర్శిస్తున్నారు. నాగార్జునసాగర్, చార్మినార్, బుద్ధవనం వంటి ప్రదేశాలు వీరి పర్యటనలో భాగమయ్యాయి. ఈ నేపథ్యంలో వారి ఆతిథ్యానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకు తెలంగాణ ప్రభుత్వం విందు
మంగళవారం రాత్రి చారిత్రక చౌమహల్లా ప్యాలెస్‌లో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకు తెలంగాణ ప్రభుత్వం విందు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ విందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన భార్యతో పాటు కుమార్తె నైమిషా రెడ్డి కూడా హాజరయ్యారు. ఎంతో వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్లకు తెలంగాణ సంస్కృతి, ఆతిథ్య పరంపరలను పరిచయం చేశారు. కళాత్మక ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు సందడి కలిగించాయి.
సినీ ప్రముఖులు హాజరు
ఈ ప్రత్యేక కార్యక్రమానికి సినీ రంగం నుండి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. నటుడు నాగార్జున, నిర్మాత సురేశ్ బాబు, అల్లు అరవింద్ వంటి ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. వ్యాపార, రాజకీయ, సాంస్కృతిక రంగాల ప్రముఖుల హాజరుతో ఈ విందు మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ హైదరాబాద్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొస్తున్నాయి.
Read Also :UPSC Chairman : UPSC ఛైర్మన్ గా అజయ్ కుమార్