ధనుస్సు రాశి
ధనుస్సు రాశి
19-03-2026 | గురువారంధనుస్సురాశి వారికి ఈ సంవత్సరం ద్వితీయం, తృతీయలో రాహువు, చతుర్దంలో శనీశ్వరుడు, సప్తమం, అష్టమం, భాగ్యంలో గురువు, భాగ్యం అష్టమంలో కేతువు, గ్రహ సంచారం గలదు. శని గ్రహ స్థానాన్ని, గురుగ్రహ స్థానాన్ని, పరిశీలించుకుని తగిన శాంతి క్రతువులు జరిపించండి. సత్ఫలితాలు పొందుతారు. ఈ రాశిలో జన్మించిన వారు మహా పాశుపత హెూమం జరిపించండి. చేతికి శక్తి కంకణం ధరించండి. చదువులో రాణించగలుగుతారు. కొంత కాలం చికాకులు పడ్డప్పటికీ కొంతమంది వలన ఏకాగ్రత కోల్పోయినప్పటికీ పరీక్షల సమయంలో మాత్రం మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మంచి ఫలితాలను పొందగలుగుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాలం కలిసి వస్తుంది. హైయర్ ఎడ్యుకేషన్ కోసం తీసుకోని నిర్ణయాలు సత్ఫలితాలను అందిస్తాయి. ఉద్యోగంలో ఒత్తిడి మరింతగా పెరుగుతుంది. కార్యాలయంలో మీరంటే పడనటువంటి వాళ్లే ఎక్కువగా ఉంటారు. ఏదో ఒక కారణంతో పై అధికారులు ముందు మిమ్మల్ని ఇబ్బంది గురిచేయాలని తరచూ చాడీలు చెప్పేవారు ఎక్కువగా ఉంటారు. వీరితో కాస్తంత అప్రమత్తంగా ఉండండి. ప్రత్యక్షమైనటువంటి గొడవ వీళ్ళతో మనకు అవసరం లేదు. వీళ్ళ మాటలు విని మిమ్మల్ని నిందించే అధికారులతోనూ గొడవలు అవసరం లేదు. కొంతకాలం సంయమనంతో నిరీక్షించగలిగితే మంచి మార్పు ఏర్పడుతుంది.
సొంత ఇంటి కల కొత్త ఇల్లు కొనుగోలు చేయాలని ఆలోచనలు లేదా ప్లాట్‌కు సంబంధించిన అంశాలు అనుకూలంగా ఉంటాయి. అందరి అండదండలను సహాయాన్ని సరైన సమయానికి పొందగలుగుతారు. అనుకున్నట్టుగా స్థిరాస్తులను ఏర్పాటు చేసుకోగలుగుతారు. మంచి చెడులను పంచుకోవడానికి కష్టం వస్తే బాధ పంచుకోవడానికి ఒక స్నేహితుడు మీ జీవితంలో ఉండటం సంతోషాన్ని కారణమవుతుంది. మానసిక ఊరటని కలిగి ఉంటారు. ఇంటీరియర్ డెకరేషన్ చేసే వారికి, సివిల్ ఇంజనీర్లకి, కాలం కలిసి వస్తుంది. వ్యాపారాలలో మంచి ఫలితాలు ఆదాయాన్ని పొందగలుగుతారు. సంవత్సర ద్వితీయార్థంలో జీవితంలో మంచి మార్పులు ఏర్పడతాయి. సంతాన సంబంధమైన విషయాలలో మంచి ఆలోచనలు చేయగలుగుతారు. వైద్యుల సలహాలు సూచనలు తీసుకుని మంచి శుభవార్త వినగలుగుతారు. చదువుకుంటున్న పిల్లలకు ఆర్థికపరమైనటువంటి సమస్యలు రాకుండా మంచి జాగ్రత్తలు తీసుకోవాలి. మనము పడ్డ కష్టం మనం పడే బాధ మన జీవితంలో ఉన్న వెలితి పిల్లల జీవితాలలో ఉండకూడదు. వాళ్ళ జీవితం వాళ్ళు సంతోషంగా సుఖంగా గడపాలని మీరు ఎన్నో త్యాగాలు చేసి ధనాన్ని కూడబెడతారు. వస్త్ర వ్యాపారస్తులకు సివిల్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ వ్యాపారస్తులకు మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. కొత్త పెట్టుబడులను వనరులను సమకూర్చుకొని మరొక బ్రాంచ్ని షాపుని ప్రారంభించాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. ఎన్నో ప్రయత్నాల తర్వాత శుభ ఫలితాలను అందుకుంటారు. ఇంటికి సంబంధించిన రిపేర్లు రెనోవేషణలు పెద్ద సమస్యగా మారతాయి ధనం ఒకందుకు దాచుకోవడము అది ఇంకొక అందుకు వృధాగా ఖర్చు అవ్వటం ఇబ్బందిగా మారుతుంది. చేసేదేమీ లేక రుణాలను తీసుకొని కొన్ని వ్యవహారాలను చక్కబెడతారు. విహారయాత్రలు చేయాలన్న ఆలోచనలు ముడి పడతాయి. కుటుంబ సమేతంగా చేయ గలుగుతారు.
మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు నాట్యం పట్ల ఆకర్షితులవుతారు. నేర్చుకోవాలని ప్రయత్నాలు కలిసి వస్తాయి. విదేశాలలో చదువు కోసం చేసే ప్రయత్నాలు ద్వితీయ ప్రయత్నంలో అనుకూలంగా మారతాయి. సహోదర సహోదరీ మీతో కొన్ని సందర్భాలలో గొడవలకి వాగ్వివాదాలకి ప్రయత్నం చేసినప్పటికీ పెద్దవాళ్ల సలహాలు సూచనలతో మీరు అవి పరిష్కార దిశకు చేరుస్తారు. సాధ్యమైనంత వరకు కుటుంబ చీలికలు కుటుంబ పరువు మర్యాదలకు సంబంధించిన అంశాలలో దృఢమైన అభిప్రాయంతో మంచి నిర్ణయాలను తీసుకుంటారు. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మేరకు మీకు ఉన్నటువంటి కొన్ని చెడు అలవాట్లు ఆలోచనలకు దూరంగా ఉంటారు. ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం వెన్నునొప్పి, లివరు, కిడ్నీ ఇన్ఫెక్షన్లతో బాధపడే అవకాశం ఉంటుంది. తరచూ వాతావరణంలో మార్పులు కారణంగా తొందరగా అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి ఒకళ్ళకి ఇద్దరు వైద్యులను సంప్రదించి మంచి వైద్యం పొందగలుగుతారు. కొంతమంది మీకు ఇచ్చే సలహాల కారణంగా మీరు కొన్ని విషయాలలో తప్పుగా ఆలోచించి తప్పు నిర్ణయాలు తీసుకున్నామని ఆలస్యంగా గ్రహిస్తారు. ప్రస్తుతానికి చేయగలిగింది ఏమీ లేక నిరాశ చెందుతారు.
ఈరోజు ఫలితాలు