తిరుమల (Tirumala) శ్రీవారి ఆలయానికి ప్రతి రోజూ వేలాది మంది భక్తులు దర్శనార్థం వస్తారు. ఏడాదంతా ఎప్పుడూ భక్తులతో నిండిపోయే ఈ పవిత్రక్షేత్రంలో ప్రత్యేక పూజలు, ఆచారాలు, ఉత్సవాలు నిరంతరంగా జరుగుతూనే ఉంటాయి. అలాంటి ముఖ్యమైన ఆచారాలలో ఒకటి కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం. ఈ ప్రత్యేక కార్యక్రమం సంవత్సరానికి నాలుగు సార్లు జరుగుతుందని చాలా మందికి తెలిసిందే. ఆలయ గర్భగుడి, ప్రధాన మండపం, ప్రాంగణాన్ని శుద్ధి చేసే ఈ వేడుకకు అత్యంత ప్రాముఖ్యత ఉంది.
ఈ నెల సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాలు (Tirumala annual Brahmotsavam) నిర్వహించబోతున్నారు. ఈ ఉత్సవాలకు ముందు భాగంగా సెప్టెంబర్ 16న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం (Koil Alwar Thirumanjanam) జరగనుంది. ఈ సందర్భంగా ఆలయ గర్భగుడి సహా యావత్తు ప్రాంగణాన్ని విశేష రీతిలో శుద్ధి చేస్తారు. గర్భగుడి తలుపులు మూసివేసి, పూజారులు, అర్చకులు ప్రత్యేక పూజలతో ఆలయాన్ని పవిత్రం చేస్తారు.

దర్శనాలపై ప్రభావం
కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సమయంలో శ్రీవారి ప్రధాన మూర్తిని తెల్లని వస్త్రంతో కప్పి ఉంచుతారు. దేవతా మూర్తులను, ఇతర వస్తువులను ఆలయంలోని గర్భగుడి నుంచి బయటకు తీసుకువస్తారు. అనంతరం కర్పూరం, గంధం, కుంకుమ, పసుపు, కిచ్చిలి గడ్డ, సుగంధ మిశ్రమంతో శుభ్రం చేస్తారు.
ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకూ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కొనసాగుతుంది. ఆ తర్వాత ప్రధాన విగ్రహంపై ఉన్న వస్త్రాన్ని తొలగిస్తారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, నైవేద్యం సమర్పించిన అనంతరం.. పది గంటల తర్వాత భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తారు. ఈ నేపథ్యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం రోజున పలు సేవలను టీటీడీ రద్దు చేస్తూ ఉంటుంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: