తిరుమలలో ఫిబ్రవరి 4న జరగనున్న రథ సప్తమి వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.తిరుపతిలో ఇటీవల జరిగిన తొక్కిసలాట ఘటన తర్వాత, భక్తుల భద్రతను మేలు చేసేందుకు టీటీడీ మరింత జాగ్రత్తలు తీసుకుంటోంది.ఈ నేపథ్యంలో, రథసప్తమి వేడుకలకు సంబంధించి అన్ని ఏర్పాట్లపై టీటీడీ బోర్డు జనవరి 31న అత్యవసరంగా సమావేశం కానుంది.రథ సప్తమి రోజున తిరుమలలో అద్భుతమైన ధార్మిక కార్యక్రమాలు జరుగుతాయి.భక్తుల భద్రత పట్ల టీటీడీ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.రథ సప్తమి వేడుకలు, సూర్య జయంతి సందర్భంగా తిరుమలలో మినీ బ్రహ్మోత్సవాల తరహాలో నిర్వహిస్తారు.
పలు వాహనాలపై మలయప్ప స్వామి తిరువాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేస్తారు.ఈ వేడుకలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో, ఫిబ్రవరి 3 నుండి 5 వరకు స్లాటెడ్ సర్వదర్శనం (SSSD) టోకన్ల జారీని రద్దు చేశారు.టోకన్లు లేని భక్తులు నేరుగా సర్వదర్శనం క్యూలైన్లలో ప్రవేశించి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు.ఫిబ్రవరి 4న ఆర్జిత సేవలతో పాటు, వీఐపీ బ్రేక్ దర్శనాలు కూడా రద్దు చేశారు.ఈ రోజున ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రమే దర్శనం అందించబడుతుంది.ఫిబ్రవరి 4న,ఎన్ఆర్ఐలు,చంటి పిల్లల తల్లిదండ్రులు,వృద్ధులు, దివ్యాంగులు వంటి ప్రత్యేక వర్గాలకు ఇచ్చే ప్రివిలేజ్ దర్శనాలు కూడా రద్దు చేశారన్నారు.
రథ సప్తమి రోజున వాహన సేవల షెడ్యూల్
- 5:30 AM – 8:00 AM: సూర్య ప్రభ వాహనం (సూర్యోదయం: 6:44 AM)
- 9:00 AM – 10:00 AM: చినశేష వాహనం
- 11:00 AM – 12:00 PM: గరుడ వాహనం
- 1:00 PM – 2:00 PM: హనుమంత వాహనం
- 2:00 PM – 3:00 PM: చక్రస్నానం
- 4:00 PM – 5:00 PM: కల్పవృక్ష వాహనం
- 6:00 PM – 7:00 PM: సర్వభూపాల వాహనం
- 8:00 PM – 9:00 PM: చంద్రప్రభ వాహనంఇన్ని ఏర్పాట్లు చేసి, తిరుమలలో రథసప్తమి వేడుకలను భారీగా నిర్వహించాలని టీటీడీ సిద్ధమైంది.