Tirumala employees issue: తిరుమల తిరుపతి దేవస్థానంలో (TTD) పనిచేస్తున్న హిందూేతర ఉద్యోగుల అంశంపై అధికారాలు కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా ముందడుగు వేశాయి. పాలకమండలి చేసిన రెండు ముఖ్యమైన ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించడంతో, తదుపరి చర్యల కోసం టీటీడీ యంత్రాంగం సన్నద్ధమవుతోంది. న్యాయపరమైన సమస్యలు రాకుండా ప్రక్రియను పూర్తిచేయేందుకు అధికారులు సమగ్ర వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారు.
టీటీడీ బోర్డు ఇటీవల జరిగిన సమావేశంలో హిందూేతర ఉద్యోగుల విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించింది. వీరికి రెండు ఆప్షన్లు సూచించాయి
- స్వచ్ఛంద పదవీ విరమణ (VRS)
- ఇతర ప్రభుత్వ శాఖలకు బదిలీ
Read Also: Tirumala: శ్రీవారి బంగారు డాలర్లు మళ్లీ అందుబాటులో

మొదటి ఎంపికగా వీఆర్‌ఎస్‌ను ఎంచుకున్నవారికి మిగతా సేవాకాలానికి సంబంధించిన జీతభత్యాలు ఒకేసారి చెల్లించే విధానాన్ని ప్రతిపాదించారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోనివారిని సంబంధిత ప్రభుత్వ విభాగాలకు బదిలీ చేసే ప్రక్రియను చేపడతారు. ఈ రెండు ఆప్షన్లలో ఉద్యోగుల ఇష్టానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని పాలకమండలి నిర్ణయించింది.
40 మంది అన్యమత ఉద్యోగులపై నిర్ణయ
టీటీడీ(Tirumala tirupathi devasthanams)లో ఇతర మతాలకు చెందిన కొంతమంది, హిందూేతరుల నియామకంపై నిబంధనలు అమల్లోకి రాకముందే ఉద్యోగాల్లో చేరినట్లు సమాచారం. వీరిలో ఎక్కువ మంది ఇప్పటికే రిటైరయ్యారు. ప్రస్తుతం సర్వీసులో ఉన్నవారి సంఖ్య సుమారు 40 మాత్రమేనని తెలుస్తోంది. ముందు వీరికి వీఆర్‌ఎస్ ఆఫర్‌ను అందిస్తూ సర్క్యులర్ ఇవ్వనున్నారు. వీఆర్‌ఎస్‌కు అంగీకరించని వారి జాబితాను దేవదాయ శాఖ మైనారిటీ సంక్షేమ శాఖకు పంపనుంది. అక్కడున్న ఖాళీల ఆధారంగా వారికి బదిలీలు అమలు చేస్తారు.
టీటీడీ తీసుకున్న ఈ చర్యలు సంస్థలో విధానపరమైన స్పష్టతను తీసుకువస్తాయని అధికారులు భావిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: