వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో(TTD) ఏర్పాట్లు జోరుగా జరుగుతున్నాయి. ఈ నెల 30న ప్రారంభమయ్యే వైకుంఠ ద్వార దర్శనాలు జనవరి 8 వరకు కొనసాగనున్నాయి. ఈ కాలంలో లక్షలాది మంది భక్తులు శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేసి, అనుగుణంగా ఏర్పాట్లను వేగవంతం చేసింది. ఇప్పటికే తొలి మూడు రోజుల కోసం 1,76,000 మందిని ఈ-డిప్ ద్వారా ఎంపిక చేశారు.
Read Also: Tirumala: శ్రీవారి బంగారు డాలర్లు మళ్లీ అందుబాటులో

సామాన్య భక్తులకు ప్రాధాన్యం — 182 గంటల్లో 164 గంటలు కేటాయింపు
మొత్తం 182 గంటల దర్శన సమయాల్లో, 164 గంటలను సామాన్య భక్తుల కోసం మాత్రమే కేటాయించినట్లు టీటీడీ(TTD) ప్రకటించింది. తొలి మూడు రోజుల్లో శ్రీవాణి మరియు ప్రత్యేక ప్రవేశ దర్శనం పూర్తిగా రద్దు చేశారు. మిగిలిన రోజుల కోసం శ్రీవాణి టికెట్లు ఉదయం 10 గంటలకు, ప్రత్యేక ప్రవేశం టికెట్లు మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. రోజుకు శ్రీవాణి 1,000, ప్రత్యేక ప్రవేశం 15,000 టికెట్లు అందుబాటులో ఉంచారు.
వీఐపీ బ్రేక్ దర్శనాలకు 15 రోజుల విరామం
వైకుంఠ ఏకాదశి, తిరుమల పర్వదినాలు, ప్రత్యేక కార్యక్రమాల నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను 15 రోజులపాటు నిలిపివేశారు. ఈ నెల 23న జరిగే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 29–జనవరి 8 వరకు జరగనున్న వైకుంఠ ఏకాదశి(Vaikuntha Ekadashi) ద్వార దర్శనాలు కారణంగా వీఐపీ బ్రేక్ దర్శనాలు అందుబాటులో ఉండవు. రథసప్తమి (జనవరి 25) రోజున కూడా ప్రోటోకాల్ వ్యక్తులను మినహా ఇతరులందరికీ వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. ఈ తేదీలకు సంబంధించిన సిఫారసు లేఖలను ముందస్తుగా కూడా టీటీడీ స్వీకరించబోదని స్పష్టం చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: