శ్రీవారి దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తిరుమల తిరుపతి(Tirumala) దేవస్థానం (టీటీడీ) నిరంతరం కొత్త కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైకుంఠ ద్వార దర్శనాల కోసం తిరుమలకు వచ్చే భక్తులు తాగునీటి సమస్య ఎదుర్కొనకుండా ఉండేందుకు ‘మొబైల్ జల ప్రసాదం’ విధానాన్ని ప్రారంభించింది.
Read Also: Tirupati: గోపురంపై మద్యం మత్తులో వ్యక్తి హల్చల్

మానవ సేవే మాధవ సేవగా శ్రీవారి సేవ
భక్తుల సేవనే పరమావధిగా భావిస్తూ టీటీడీ 2000 నవంబర్‌లో ‘శ్రీవారి సేవ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గత 25 ఏళ్లుగా ఈ సేవ ద్వారా 17 లక్షల మందికి పైగా సేవకులు పాల్గొని శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు సేవలందిస్తున్నారు. సామాన్యుడి నుంచి సంపన్నుడి వరకు అన్ని వర్గాల వారు శ్రీవారి సేవలో పాల్గొని భక్తులకు సహాయం చేస్తున్నారు.
భక్తుల వద్దకే తాగునీరు.. మొబైల్ జల ప్రసాదం ప్రత్యేకత
ఇప్పటివరకు క్యూ లైన్లు, కంపార్ట్మెంట్లు, దర్శన మార్గాల్లో కులాయిలు, డ్రమ్‌ల ద్వారా తాగునీటిని టీటీడీ అందిస్తోంది. అయితే బయటి క్యూ లైన్లు మరియు రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో భక్తులకు ఇబ్బందులు ఎదురవుతుండటంతో, వాటిని నివారించేందుకు మొబైల్ జల ప్రసాదం విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. ఈ విధానంలో తాగునీటిని భక్తుల దగ్గరకే తీసుకెళ్లి అందిస్తున్నారు.
శ్రీవారి సేవకుల ద్వారా నీటి పంపిణీ
ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీవారి(Tirumala) సేవలో పాల్గొనే వారికి 10 లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్ క్యాన్లు అందజేస్తున్నారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సేవకులు భక్తులకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం తిరుమలలో 15 వాటర్ క్యాన్లతో ఈ సేవను అమలు చేస్తుండగా, భక్తుల నుంచి వచ్చే స్పందనను బట్టి దీన్ని మరింత విస్తరించాలని టీటీడీ భావిస్తోంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: