తిరుమల : తిరుమల(Tirumala) లడ్డూలకు కల్తీనెయ్యి సరఫరాచేసిన కేసులో టిటిడి మాజీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డికి కీలకమైన మాజీ వ్యక్తిగత సహాయకుడు(పిఎ) చిన్న అప్పన్నకు హైకోర్టులో ఊహించని పరిణామం ఎదురైంది. ఆయన తరపున న్యాయవాదులు వారంరోజుల క్రిందట దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. కల్తీనెయ్యి కేసులో చిన్నఅప్పన్న పాత్ర అత్యంత కీలకమని, అటు డెయిరీల నిర్వాహకులతో ఇటు టిటిడి అధికారులతో మాట్లాడి కమీషన్లు దండుకున్న వ్యక్తి ఇతనేనని సిబిఐ సిట్ ఆధారాలు సమర్పించింది. ఇప్పటికేచిన్న అప్పన్న నెల్లూరు జైల్లో రిమాండ్లో ఉన్నాడు. ఇప్పుడు ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను ధర్మాసనం కొట్టివేయడంతో తదుపరి ఏమిటనేది ఉత్కంఠ నెలకొంది.
Read Also: Tirumala: ఈనెల 18న మార్చి నెల తిరుమల దర్శన కోటా విడుదల

కల్తీనెయ్యి సరఫరాచేసిన పాపంలో అసలు సూత్రధారులైన గత టిటిడి పెద్దల అవీనీతిగుట్టు రట్టయ్యే అవకాశం కూడా ఉండటంతో సిట్ అధికారులు అన్ని కోణాల్లో కార్యాచరణ
డెయిరీ, సిద్ధంచేసుకొంటున్నారు. 2022లో అప్పటి టిటిడి బోర్డు లో కొందరు అక్రమాలు భారీగానే ఉన్నాయని సిట్ అధికారులు ఆధారాలు సేకరించారు. మరింత కీలక సమాచారం సేకరించడానికి అప్పన్నను కస్టడీకి తీసుకునే విషయంలో మరోసారి ముందుకు కదలనుంది. బోలేబాబాడెయిరీతోబాటు ఏఆర్ డెయిరీ, వైష్ణవి ప్రీమియర్అగ్రిపుడ్స్తో ఒప్పందంతో భారీగా కమీషన్లు 50లక్షల వరకు రాబట్టారనేది సిట్(SIT) విచారణలో వెలుగుచూసిన అంశాలు. అప్పన్న బ్యాంకు లావాదేవీలోల్ల 4.50కోట్ల రూపాయలు నిల్వ ఉండటం, ఆయన పేరున కొన్ని చోట్ల 14వరకు స్థలాలు, ప్లాట్లు ఉన్నాయని సిట్ విషయాలు రాబట్టింది. ఇప్పటికే అతనిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు సోమవారం వాదప్రతివాదనలు పూర్తయిన తరువాత ధర్మాసనం ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. టిటిడి(Tirumala) తరపున, సిబిఐ తరపున న్యాయవాదులు చేసిన వాదనలతో హైకోర్టు ధర్మాసనం ఏకీభవించింది. మరీ చిన్నఅప్పన్న బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురవడంతో ఇక ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోనుందనేది హాట్గా ఫిక్గా మారింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: