తిరుమల : ఏడుకొండల శ్రీవేంకటేశ్వరస్వామికి సెప్టెంబర్ 23 నుండి మొదలుకానున్న సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాలకు తిరుమల (Tirumala) లో ఏర్పాట్లు మొదలయ్యాయి. తొమ్మిదిరోజులుపాటు జరిగే దేవుని ఉత్సవాలకు దేశవిదేశాల ఉండి ఆశేషంగా భక్తులు తరలివస్తారనే ముందుచూపుతో అన్ని విధాలా అవసరమైన ఏర్పాట్లు, సౌకర్యాలు, గ్యాలరీలు నిర్మాణం, మాఢవీధుల్లో ఎండకు, వానకు రక్షణగా చలువపందిళ్ళు. జర్మన్ షెడ్ లు వేసేందుకు ఇంజనీరింగ్ పనులు (Engineering works) ఆదివారం మొదలయ్యాయి. తొలుత ఉత్తరమాఢవీధినుండి ఈ పనులు శ్రీకారంచుట్టారు. ఈ ఏడాది సాల కట్ల బ్రహ్మోత్సవాలుమాత్రమే జరగనున్నాయి. ఈ వాహన భక్తుల మధ్య జరిపిం చేందుకు తిరుమలతిరుపతి దేవస్థానం సిద్ధమవుతోంది.

భద్రత పరంగా
ఆలయం పరిసరాలు, మాఢవీ ధుల్లో గ్యాలరీలు, ఇనుప పైపులతో నింపేస్తు న్నారు. ఈ పనులు మెల్లగా నెలన్నరరోజులు పటిష్టంగా సాగనున్నాయి. బ్రహ్మోత్స వాలకు ముందే ఆణివార ఆస్థానంకూడా వస్తుండటంతో తిరుమల భద్రత పరంగా సిద్ధమైంది. తిరుమలకొండపై ప్రతిరోజూ ఉత్సవాలు, సేవలే, బ్రహ్మోత్సవాల (Brahmotsavalu) కు కొండను సర్వాంగసుందరంగా ముస్తాబుచేసే పనులు ఆరంభమ య్యాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 24నుండి తొమ్మిదిరోజులు ఆలయమాఢ వీధుల్లో వివిధ రకాల వాహ నసేవల్లో స్వామివారు భక్తులకు దర్శన మివ్వనున్నారు. మాఢవీధుల్లో గ్యాలరీలు ఏర్పా టుచేసే పనులు ఇంజనీరింగ్ చేపడుతోంది.
టీటీడీ (Tirumala Tirupati Devasthanams) యజమాని ఎవరు?
టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానాలు) అనేది భారతదేశంలోని ఒక స్వతంత్ర ప్రభుత్వ ట్రస్ట్. దీనిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది.
టీటీడీ రోజుకు ఎంత ఆదాయం పొందుతుంది?
తిరుమల తిరుపతి దేవస్థానానికి (TTD) రోజుకు సగటున ₹3.6 కోట్లు నుండి ₹3.85 కోట్లు వరకూ హుండీ (దాన పెట్టె) ద్వారా ఆదాయం వస్తుంది.
Read hindi news:hindi.vaartha.com
Read Also: Annamayya project: అన్నమయ్య ప్రాజెక్టును పరిశీలించిన నిపుణుల బృందం