తిరుమల: శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం కోసం రోజురోజుకూ భక్తుల సంఖ్య అనూహ్యంగా రెట్టింపవుతున్న నేపథ్యంలో తిరుమల వెలుపల కిలోమీటర్లు క్యూలైన్లకు స్వస్తిపలకడానికి వైకుంఠమ్ క్యూ కాంప్లెక్స్ -3 నిర్మాణం చేపట్టేందుకు నిపుణుల కమిటీని టిటిడి (TTD) బోర్డు ఏర్పాటు చేసింది. ఈ కమిటీ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నివేదికలిస్తే వైకుంఠమ్ 3 క్యూకాంప్లెక్స్ నిర్మాణం చేపట్టేందుకు బ్రహ్మోత్సవాల్లోపు నిర్ణయం తీసుకునే దిశగా అడుగులేస్తోంది. అలాగే హిందూ ధార్మికసంస్థ టిటిడిలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులపై నిఘా పెట్టామని, అలాంటి ఉద్యోగులను ఎవరినీ వదలిపెట్టే ప్రసక్తేలేదని కూడా బోర్డు ఛైర్మన్ బిఆర్ నాయుడు (BR Naidu) స్పష్టం చేశారు. క్యూలైన్ల నియంత్రణకు వైకుంఠమ్ క్యూకాంప్లెక్స్ -3 నిర్మాణంతోనే,2000లో వైకుంఠమ్ -2 కాంప్లెక్స్ నిర్మాణం” శీర్షికతో ప్రత్యేక కథనం, మూడురోజుల క్రిందట “అన్యమత ఉద్యోగులపై చర్యలేవీ!?” కథనాలు ప్రచురితమ య్యాయి.

బోర్డు సభ్యులు
ఈ కథనాలపై టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు, టిటిడి ఇఒ శ్యామలరావు, అదనపు ఇఒ చిరుమామిళ్ళ వెంకయ్యచౌదరి, బోర్డు సభ్యులు మంగళవారం సమావేశంలో కీలకంగా
చర్చించి అభిప్రాయాలు వెలువడించారు. వేలాదిమంది భక్తుల వెలుపల క్యూలైన్ల నియంత్రణకు వైకుంఠమ్ 3 క్యూకాంప్లెక్స్ (Vaikuntam 3 Q Complex) నిర్మాణం శరణ్యమనే అభిప్రాయాలపై ఏకీభవించారు. వైకుంఠమ్ 1, వైకుంఠమ్ 2 క్యూకాంప్లెక్స్ లలో 62కంపార్టుమెంట్లు నిండిపోతున్నాయి. ఒక్కోకంపార్టుమెంట్లో 400మంది లెక్కన 25వేలమంది వరకు భక్తులు కూర్చునేందుకు సౌకర్యంగా ఉంటుంది. ప్రస్తుతం తిరుమలలో 40వేలమంది భక్తులు వస్తేనే వైకుంఠమ్ -1,2 క్యూకాంప్లెక్స్లు నిండిపోయి నారాయణగిరిషెడ్లు నిండి ఆలయం వెలుపల మూడుకిలోమీటర్లు దూరం శిలాతోరణం వరకు భక్తుల లైన్లు వ్యాపిస్తున్నాయి. భక్తులకు అప్పటి సంఖ్యకు తగట్లు అవసరాలకు కనీసం తలదాచుకునేందుకు వైకుంఠమ్ 1 క్యూకాంప్లెక్స్ నిర్మాణం చేపట్టారు.
టిటిడి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
టిటిడి యొక్క ప్రధాన కార్యాలయం తిరుపతి పట్టణంలో ఉంది, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లా కేంద్రం.
టిటిడి ఆదాయం ఎక్కడి నుండి వస్తుంది?
హుండీ ద్వారా భక్తుల విరాళాలు,దర్శన టికెట్లు,ప్రసాదాలు (లడ్డూ మొదలైనవి),ఆలయ సేవలు, ఉత్సవాలు,స్థిరాస్తుల నుంచి వచ్చే ఆదాయం.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Minister Muralidhar Mohol: ఏపి నుంచి వారానికి 1,194 విమానాల రాకపోకలు