ప్రధాని నరేంద్ర మోడీ జనవరి 11న గుజరాత్ రాష్ట్రంలోని ప్రసిద్ధ సోమనాథ్ ఆలయాన్ని దర్శించనున్నారు. ఈ సందర్భంగా(Temple Darshan) జనవరి 8 నుంచి 11వ తేదీ వరకు జరుగనున్న ‘సోమనాథ్ స్వాభిమాన్ పర్వం’లో ఆయన పాల్గొని వివిధ కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఈ పర్వం సందర్భంగా ఆధ్యాత్మిక వేడుకలతో పాటు సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించనున్నారు.
Read also: Tirumala: రికార్డు స్థాయిలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు

హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన క్షేత్రంగా(Temple Darshan) గుర్తింపు పొందిన సోమనాథ్ ఆలయం, 12 జ్యోతిర్లింగాలలో తొలి స్థానం కలిగిన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. గుజరాత్‌లోని వెరావల్ పట్టణానికి సమీపంలో ఉన్న ఈ ఆలయం, అద్భుతమైన రాతి శిల్పకళతో నిర్మితమై వేలాది మంది భక్తులను ఆకర్షిస్తోంది.
సోమనాథ్ స్వాభిమాన్ పర్వం ద్వారా భారతీయ సాంస్కృతిక వారసత్వం, ఆధ్యాత్మిక విలువలను దేశ ప్రజలకు మరింత చేరువ చేయాలన్నదే లక్ష్యంగా అధికారులు వెల్లడించారు. ప్రధాని మోడీ పాల్గొనడం ఈ కార్యక్రమానికి మరింత ప్రాధాన్యతను తీసుకొస్తుందని భావిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: