అమరావతి రాజధాని రైతుల సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) హామీ ఇచ్చారు. పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చిన రైతుల నుండి సిబ్బంది డబ్బులు కోరితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర అభివృద్ధికి మూడు ప్రాంతీయ జోన్ల ఏర్పాటు చేస్తున్నామని, అన్ని ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పని చేస్తున్నామని ముఖ్యమంత్రి మీడియా(Media)తో వెల్లడించారు. రాజధాని రైతులు ఒకే దిశగా మిళితంగా పని చేస్తే సమస్యలను వేగంగా పరిష్కరించగలమని ఆయన అన్నారు.
Read Also: Amaravati: వాస్తు సమస్యలతో ప్రభుత్వం కీలక నిర్ణయం

గోదావరి పుష్కరాల వరకు పోలవరం
అమరావతి ప్రాంత అభివృద్ధి అసోసియేషన్(Association) కింద ఒకే జేఏసీగా ఏర్పడి రైతుల సమస్యలను చర్చించి తీర్మానం తీసుకుంటామని చెప్పారు. రైతులు రెండో దశ భూ సమీకరణ ఉపయోగాలపై అవగాహన పెరిగినట్లు, మునిస్పాలిటీ స్థాయిలో అమరావతి అభివృద్ధి కాబట్టి కలిగే ఫలితాలను అర్థం చేసుకున్నారని తెలిపారు. త్రిసభ్య కమిటీ నిరంతరం రైతులతో సంప్రదింపులు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. రాజధాని అభివృద్ధి అన్‌స్టాపబుల్‌గా జరుగుతుందని, చుట్టుపక్కల లేఅవుట్ల అనుమతులను త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు. గోదావరి పుష్కరాల వరకు పోలవరం పూర్తి చేయడానికి కృషి చేస్తున్నట్టు ప్రకటించారు.
సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో ప్రజల సమస్యలను స్వీకరించి, కొందరికి అక్కడికక్కడే పరిష్కారాలు చూపారు. ఆయన ఓపిగ్గా ప్రతి రైతు సమస్య తెలుసుకుని పరిష్కార హామీ ఇచ్చినందుకు ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: