ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరం (Kaleshwaram) పుష్కరాల (Saraswati Pushkaralu 2025 ) సందర్భంగా బ్రహ్మకుమారీలు నిర్వహించిన ఒక కార్యక్రమం తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ కార్యక్రమంలో హిందూ దేవతల చిత్రాలతో పాటు ఇతర మతాల ప్రతీకల ప్రదర్శన జరగడంతో హిందూ ధార్మిక సంఘాల ప్రతినిధులు, కొందరు స్వామీజీలు తీవ్రంగా స్పందించారు. బ్రహ్మకుమారీల బోధనలు సనాతన హైందవ ధర్మానికి విరుద్ధంగా ఉన్నాయని, ఇవి భక్తుల్లో అయోమయం సృష్టిస్తున్నాయని వారు ఆరోపించారు.
ఏసుక్రీస్తు చిత్రాల ప్రదర్శన
ప్రచారంలో భాగంగా శివలింగం, శ్రీమన్నారాయణుడు మరియు ఏసుక్రీస్తు చిత్రాలను కలిపి ప్రదర్శించిన విషయంపై ధార్మిక సంఘాల ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఇది భక్తుల విశ్వాసాలను దెబ్బతీసే పని. వేదాల ఆధారాలు లేకుండా, భగవంతుడు ఇప్పుడే పుట్టాడని చెబుతున్న మాటలు హాస్యాస్పదంగా మారుతున్నాయి” అని వారు విమర్శించారు. ఇలాంటి బోధనలు హిందూ సమాజాన్ని దారి తప్పిస్తున్నాయని పేర్కొన్నారు.
బ్రహ్మకుమారీలపై ఆగ్రహం
ఈ ఆరోపణలపై బ్రహ్మకుమారీల ప్రతినిధులు స్పందిస్తూ, తాము వ్యసన విముక్తి వంటి సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. కానీ, ప్రతినిధుల వివరణకు హిందూ సంఘాలు ఒప్పుకోలేదు. తీవ్ర ఆగ్రహానికి లోనైన కొందరు వారి ప్రచార ఫ్లెక్సీలను చించివేశారు. “ఇలాంటి ప్రచారం తక్షణం నిలిపివేయాలి, హిందూ దేవుళ్ల చిత్రాలను ఉపయోగించవద్దు” అని వారు హెచ్చరించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో పోలీసులు పరిస్థితిని గమనిస్తూ అప్రమత్తంగా ఉన్నారు.
Read Also : India – Pakistan War : భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్‌కు సాయం చేశారా..? చైనా సమాధానం ఇదే !