శ్రీశైలంప్రాజెక్టు : శ్రీశైలం(Srisailam) మల్లన్న హుండి ఆదాయం గత ఏడాది కార్తికమాసం కంటే ఈ ఏడాది కార్తికమాసం హుండి ఆదాయం రికార్డు బ్రెక్ చేసిందని శ్రీశైలదేవస్థానం ఈఓ ఎం. శ్రీనివాసరావు తెలిపారు. ఈ ఏడాది కార్తికమాసం హుండి ఆదాయం రాబడి పెరిగింద న్నారు. శ్రీశైల భ్రమరాంబా మల్లికార్జునస్వామి(Mallikarjuna Swamy)వార్ల దర్శన భాగ్యం కొరకు రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశ విదేశాల నుండి ఇతర రాష్ట్రాల నుండి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుందన్నారు. భక్తుల సంఖ్య రెట్టింపు ఉండడంతో క్షేత్ర ప్రాశ్యస్తం నలుదిశలు వ్యాపిస్తుందన్నారు.
Read Also: Tirumala: వైకుంఠద్వార దర్శనాల రిజిస్ట్రేషన్ ప్రారంభం

హుండీల లెక్కింపు ద్వారా దేవస్థానానికి
ఈ క్రమంలోనే మంగళవారం నిర్వహించిన హుండీల లెక్కింపు ద్వారా దేవస్థానానికి రూ.7,27,26,400/-ల నగదు రాబడిగా లబించిందన్నారు. కాగా ఈ హుండిల రాబాడిని భక్తులు గత 33 రోజుల్లో సమర్పించడం జరిగింది. గత ఏడాది కార్తికమాసంలో రూ.5,96,92,376/-లు రాబడిగా లబించడం జరిగిందన్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది రూ.1,30,34,024/-ల అధిక రాబడిగా లబించడం విశేషం అన్నారు. ఈ నగదుతో పాటు 117గ్రాముల 800 మిల్లిగ్రాముల బంగారం, 7 కేజిల 230 గ్రాముల వెండి లబించాయన్నారు.
అదేవిధంగా 646- యుఎస్ఏ డాలర్లు, 120-యుఏఈ దిర్హమ్, 85- సౌదిరియాల్స్, 136- కత్తార్ రియాల్స్, 30-సింగపూర్ డాలర్లు, 25-ఆస్ట్రేలియా డాలర్లు, 85- ఇంగ్లాడు పౌండ్స్, 200-ఓమన్ బైసా, మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయన్నారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరా(camera)ల నిఘాతో ఈ లెక్కింపును చేప్పట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈవో ఎం.శ్రీనివాసరావు, డిఈఓ ఆర్. రమణమ్మ, పలువురు శాఖాధిపతులు, ఆయా విభాగాల పర్యవేక్షకులు, సిబ్బంది, శివసేవకులు, దేవదాయశాఖ ఇన్స్పెక్టర్ హరిచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: