Srikalahasti : శ్రీకాళహస్తీశ్వరాలయం భక్తులతో కిటకిట లాడింది. ఆలయంలో సోమవారం శివయ్యకు ప్రీతి పాత్రమైన రోజు కాబట్టి దూర ప్రాంతాలు పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు అభిషేకాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఆలయంలో నిత్యకళ్యాణం పచ్చ తోరణంలా పూజలు అభిషేకాలు నిర్వహించబడుతుంది. ఓ వైపు స్వామి అమ్మవార్లకు అభిషేకాలతో పాటు రాహుకేతు దోష నివారణ పూజలు, శనీశ్వరునికి ప్రత్యేకాభిషేకాలు, ఇక స్వామి అమ్మవార్లకు నిత్యకళ్యాణం, మృత్యుం జయస్వామికి అభిషేకాలతో పునీతమౌతుంది.
Read Also: Tirumala: శ్రీవారి బంగారు డాలర్లు మళ్లీ అందుబాటులో

నిత్యకల్యాణోత్సవం వైభవంగా
ఆలయాధికారులు అందించిన సమాచారం మేరకు సోమవారం సుమారు పాతికవేల మంది స్వామి అమ్మవార్లను దర్శించుకోగా రాహుకాల సమయంలో సుమారు 5వేల మంది భక్తులు పూజలు జరిపించుకున్నట్లు సమాచారం. సోమవారం ఆలయంలోని స్వామి అమ్మవార్ల నిత్యకల్యాణోత్సవానికి విశేష స్పందన వచ్చింది. గణపతి పూజలు, నవగ్రహ పూజలు, యజోపవేత పూజలు, మాంగల్య ధారణ కార్యక్రమూలు నిర్వహించారు.
మృత్యుంజయస్వామికి షోడషాభిషేకాలు
మృత్యుంజయినికి షోడషాభిషేకాలు శ్రీకాళహస్తీశ్వరాలయం(Srikalahasti Temple)లో వెలసిన మృత్యుంజయస్వామికి సోమవారం ప్రత్యేకాభిషేకాలు, అలంకారాలు నిర్వహించారు. స్వామికి పాలు, పంచామృతం, చందనం, విభూది, పచ్చ కర్పూరంతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం పలు రకాల సుగంధ పరిమళపుష్పాలు, గజమా లలు, వెండి నాగాభరణలతో శోభాయ మానంగా అలంకరించి ధూప, దీపనైవేద్యాలను మహా మంగళ హారతులిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. భక్తులందరికీ తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: