हिन्दी | Epaper

Bhadrachalam : భద్రాచలంలో ప్రారంభమైన శ్రీరామ పట్టాభిషేకం

sumalatha chinthakayala
Bhadrachalam : భద్రాచలంలో ప్రారంభమైన శ్రీరామ పట్టాభిషేకం

Bhadrachalam : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. శ్రీరామనవమి పర్వదినం తర్వాతి రోజు ఈ ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా సీతా, లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర మూర్తి పట్టాభిషేక వేదిక వద్దకు చేరుకున్నారు. పురోహితులు వేద మంత్రోచ్ఛారణల నడుమ భక్తుల సాక్షిగా ఈ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. శ్రీరామ పట్టాభిషేకం చూడటానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

భద్రాచలంలో ప్రారంభమైన శ్రీరామ పట్టాభిషేకం

పట్టాభిషేకనికి హాజరైన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి 12.30 గంటల వరకు పట్టాభిషేక క్రతువు జరిగింది. కల్యాణం అనంతరం ఒక్క రామయ్యకు మాత్రమే నిర్వహించే విలక్షణ ఉత్సవం మహాపట్టాభిషేకం. కాగా ఆదివారం శ్రీరామనవమి సందర్బంగా భద్రాద్రిలో సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. రామ నామ జపంతో భక్తులు పరవశించిపోతుండగా.. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహించారు. ఇక, నిన్న సీఎం రేవంత్ దంపతులు స్వామి వారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించగా.. నేడు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పట్టాభిషేక కార్యక్రమానికి హాజరై పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.

Read Also: ఇజ్రాయెల్‌ భీకర దాడి.. గాజాలో 32 మంది మృతి!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భద్రాద్రి రామయ్య తలంబ్రాల చరిత్ర తెలుసా ?

భద్రాద్రి రామయ్య తలంబ్రాల చరిత్ర తెలుసా ?

తిరుమల పరకామణిలో చోరీ కేసు పై టీటీడీ క్లారిటీ

తిరుమల పరకామణిలో చోరీ కేసు పై టీటీడీ క్లారిటీ

కదిరి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మ రథోత్సవంలో అపశృతి

కదిరి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మ రథోత్సవంలో అపశృతి

భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు వీఐపీ దర్శనాలు నిలిపివేత

భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు వీఐపీ దర్శనాలు నిలిపివేత

దేశంలోనే అతి పెద్ద మూడో తేరు.. లక్షలాదిగా తరలిరానున్న భక్తులు!

దేశంలోనే అతి పెద్ద మూడో తేరు.. లక్షలాదిగా తరలిరానున్న భక్తులు!

తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న మీనాక్షి
0:33

తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న మీనాక్షి

విజయవాడ దుర్గమ్మ సన్నిధికి సీఎం చంద్రబాబు

విజయవాడ దుర్గమ్మ సన్నిధికి సీఎం చంద్రబాబు

శ్రీ కనక దుర్గమ్మ మహాకుంభాభిషేక మహోత్సవాలకు శ్రీకారం

శ్రీ కనక దుర్గమ్మ మహాకుంభాభిషేక మహోత్సవాలకు శ్రీకారం

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి జాన్వీ క‌పూర్

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి జాన్వీ క‌పూర్

అంగరంగ వైభవంగా ఒంటిమిట్ట శ్రీరామ బ్రహ్మోత్సవాలు

అంగరంగ వైభవంగా ఒంటిమిట్ట శ్రీరామ బ్రహ్మోత్సవాలు

గువాహతిలోని కామాఖ్య అమ్మవారిని దర్శించుకున్న బండి సంజయ్

గువాహతిలోని కామాఖ్య అమ్మవారిని దర్శించుకున్న బండి సంజయ్

టీటీడీ ఛైర్మన్ ను తక్షణమే తొలగించాలంటూ నారాయణ డిమాండ్

టీటీడీ ఛైర్మన్ ను తక్షణమే తొలగించాలంటూ నారాయణ డిమాండ్

📢 For Advertisement Booking: 98481 12870