Sabarimala: శబరిమల (Sabarimala) ఆలయంలో బంగారు తాపడం (gold plating) పనుల సమయంలో 4.5 కిలోల బంగారం మాయం అయిన ఘటనలో విచారణ మరింత ఆసక్తికర మలుపు తిరిగింది. ఈ పనులకు ప్రధాన దాతగా ముందుకు వచ్చిన ఉన్నికృష్ణన్ అనే వ్యక్తికి స్థిరమైన ఆదాయం కూడా లేకపోవడం అధికారుల దృష్టికి వచ్చింది. బెంగళూరుకు చెందిన ఉన్నికృష్ణన్ గత ఏడాది సమర్పించిన ఆదాయ పన్ను వివరాలు పరిశీలించగా, ఆయనకు పెద్దగా ఆర్థిక వనరులు లేవని స్పష్టమైంది. అంతేకాదు, ఇతర దాతలు ఇచ్చిన విరాళాలను తానే ఇచ్చినట్లుగా ప్రచారం చేసుకున్నట్లు సిట్ విచారణలో బయటపడింది. శబరిమల ఆలయ వ్యవహారాలను పర్యవేక్షించే ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ) విజిలెన్స్ నివేదిక ప్రకారం, ‘కామాక్షి ఎంటర్‌ప్రైజెస్’ అనే సంస్థ ఉన్నికృష్ణన్ బ్యాంకు ఖాతాలో రూ.10.85 లక్షలు జమ చేసినట్లు గుర్తించారు. అలాగే, స్వర్ణ తాపడం కోసం బళ్లారికి Ballari చెందిన వ్యాపారి గోవర్ధన్ నిధులు అందజేశారని నివేదిక పేర్కొంది.
Today Gold Rate 14/10/25 : బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి

Sabarimala
శ్రీకోవెల గుమ్మం తానే విరాళంగా ఇచ్చానని ఉన్నికృష్ణన్ చెప్పుకున్నా, వాస్తవానికి బెంగళూరుకు (Bengaluru) చెందిన మరో వ్యాపారి అజికుమార్ దానిని సమర్పించినట్లు తేలింది. 2017 నుంచి ఇప్పటివరకు ఉన్నికృష్ణన్ అన్నదానం పేరుతో నగదు, బియ్యం, కూరగాయలు సహా పలు విరాళాలు ఇచ్చినట్లు ఉన్నా — వాటి మూలం స్పష్టంగా తెలియడం లేదని విచారణ అధికారులు తెలిపారు. 2019లో శబరిమల అయ్యప్ప స్వామి గర్భగుడికి టీడీబీ బంగారు తాపడం పనులు అప్పగించగా, స్వామి వారికి భక్తులు సమర్పించిన బంగారం వినియోగించబడింది. Sabarimala కానీ పనులు పూర్తయ్యాక లెక్కల్లో తేడాలు బయటపడ్డాయి. ప్రాథమిక విచారణలో మొత్తం 4.5 కిలోల బంగారం మాయమైందని తేలడంతో సంచలనం రేగింది. ప్రస్తుతం సిట్ ఉన్నికృష్ణన్‌ను ఏ1 నిందితుడిగా పేర్కొంది. టీడీబీకి చెందిన మరికొందరు అధికారులను కూడా విచారణ పరిధిలోకి తీసుకుంది. ఈ ఘటనపై కేరళ హైకోర్టు ఇప్పటికే ప్రత్యేక విచారణకు ఆదేశాలు జారీ చేసింది.
శబరిమల బంగారం మాయం కేసులో ఎంత బంగారం మాయమైంది?
మొత్తం 4.5 కిలోల బంగారం మాయమైనట్లు సిట్ ప్రాథమిక విచారణలో తేలింది.
ప్రధాన నిందితుడు ఎవరు?
బంగారు తాపడం పనులకు బాధ్యత వహించిన బెంగళూరుకు చెందిన ఉన్నికృష్ణన్ ప్రధాన నిందితుడు (ఏ1)గా పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: