కేరళలోని శబరిమల(Sabarimala) అయ్యప్ప స్వామి ఆలయంలో ఈ సంవత్సరం మండల-మకరవిళక్కు సీజన్ ప్రారంభంలోనే రికార్డు ఆదాయం నమోదైంది. నవంబర్ 17 నుంచి డిసెంబర్ 1 వరకు 15 రోజుల్లో ఆలయానికి రూ. 92 కోట్లు లభించాయని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు ప్రకటించింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 33.33% అధికం.
Read Also: Shabarimala: 18 పావన మెట్లు: ముక్తికి మార్గసూచిక

ఈ భారీ వృద్ధికి ప్రధాన కారణం అయ్యప్ప ప్రసాదం విక్రయాలు పెరగడం. ప్రసాదం అమ్మకాల వల్లే రూ. 47 కోట్లు రావడం విశేషం. గత ఏడాదితో పోలిస్తే ప్రసాదం ఆదాయం 46.86% పెరిగింది. హుండీ ఆదాయం కూడా 18% పెరిగింది.
భక్తులు శబరిమలను దర్శించడంతో ఆదాయం
ఈ కాలంలో 13 లక్షల మందికి పైగా భక్తులు శబరిమలను దర్శించడంతో ఆదాయం(Income) పెరిగిందని టీడీబీ తెలిపింది. పెరుగుతున్న రద్దీ కారణంగా మలికప్పురం ఆలయం వెనుక హాల్లో ప్రతిరోజు 10,000 మందికి పైగా భక్తులకు ఉచిత అన్నదానం అందిస్తున్నారు.
వేడుకలు ఇంకా కొనసాగుతున్నందున ఈ సీజన్ చివరికల్లా ఆదాయం మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశం ఉందని దేవస్థానం భావిస్తోంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: