ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య (Ayodhya) రామమందిరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. నవంబర్ (నేడు) 25వ తేదీన రామజన్మభూమి ఆలయంలో కాషాయ జెండాను ఎగురవేయనున్నారు. ఆలయ ప్రధాన నిర్మాణ పనులు పూర్తి అయినట్లుగా ఈ ధ్వజారోహణ వేడుక చారిత్రక మైలురాయిగా నిలవనుంది. ఈ చారిత్రక వేడుక కోసం అయోధ్య నగరం పండుగ శోభను సంతరించుకుంది. రోడ్ల శుభ్రత, కొత్త సైన్ బోర్డుల ఏర్పాటు, విస్తృతమైన పారిశుద్ధ్య నిర్వహణ వంటి పనులు పూర్తిస్థాయిలో జరుగుతున్నాయి.
Read Also: Fuel Density: ఫ్యూయల్ డెన్సిటీ: మీ వాహనానికి ఎందుకు కీలకం?

కాషాయ జెండాపై సూర్యుడి చిహ్నం
(Ayodhya) ఆలయ నిర్మాణం పూర్తయిన సందర్భంగా 10 ఫీట్ల హైట్, 20 ఫీట్ల లెంగ్త్ ఉన్న ట్రయాంగిల్ ఫ్లాగ్‌ను ఆవిష్కరిస్తారు.ఈ వేడుకలో ఆవిష్కరించే కాషాయ జెండాపై సూర్యుడి చిహ్నం ఉంటుంది. సూర్యుడు అనేది శ్రీరాముడికి సంబంధించిన అనంత శక్తి, దైవిక తేజస్సు, ధర్మం, జ్ఞానాన్ని సూచిస్తుంది. కాశీ పండితుడు గణేశ్వర్ శాస్త్రి మార్గదర్శకత్వంలో.. అయోధ్య, కాశీ, దక్షిణాది నుంచి వచ్చిన 108 మంది ఆచార్యులు ఈ ఆధ్యాత్మిక క్రతువును నిర్వహిస్తారు.
2024 జనవరి 22వ తేదీన బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని స్వయంగా నిర్వహించిన ప్రధాని మోదీ.. మరోసారి ఈ ధ్వజారోహణ క్రతువు నిర్వర్తించనున్నారు. ఈ చారిత్రక కార్యక్రమానికి సాధువులు, ప్రముఖులు, ట్రస్ట్ సభ్యులతో సహా సుమారు 6 వేల మంది ఆహ్వానితులు హాజరు కానున్నారని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అంచనా వేసింది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: