మారిషస్ ప్రధానమంత్రి నవీన్ రాంగులాం (Naveen Ramgoolam) ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన సెప్టెంబర్ 9వ తేదీ నుంచి భారత్‌లో పలు రాష్ట్రాలు, ప్రధాన ప్రాంతాలను సందర్శిస్తున్నారు. కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి వారి దర్శనార్థం సోమవారం సాయంత్రం తిరుమల చేరుకున్నారు.సతీసమేతంగా విచ్చేసిన ఆయనకు పద్మావతి అతిథిగృహం వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) (TTD)అధికారులు సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు.
ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది
తిరుమల పద్మావతి అతిథి గృహం (Tirumala Padmavati Guest House) వద్ద ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు సంప్రదాయ పద్ధతిలో ఘన స్వాగతం పలికారు. మంగళవారం ఆయన శ్రీవారిని దర్శించుకోనున్నారు.సెప్టెంబర్ 11న వారణాసిలో భారత ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) తో ఆయన సమావేశమయ్యారు. ఈ భేటీలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్టం చేసుకోవడంపై విస్తృతంగా చర్చించారు.

ఈ సందర్భంగా, మారిషస్ (Mauritius) కు భారత్ రూ. 5,984 కోట్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. దీంతో పాటు తీరప్రాంత భద్రత, వాణిజ్యం, సాంకేతికత సహా ఏడు కీలక రంగాల్లో ఇరు దేశాలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.మంగళవారం ఆయన శ్రీవారిని దర్శించుకోనున్నారు. సెప్టెంబర్ 16తో ఆయన భారత పర్యటన ముగియనుంది. ఈ పర్యటనతో ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలు మరింత బలపడటంతో పాటు, ఆర్థిక, భద్రతా రంగాల్లో సహకారానికి కొత్త మార్గాలు ఏర్పడ్డాయని అధికారులు పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: