ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా, తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన మేడారం(Medaram) సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 తేదీలు ఖరారయ్యాయి. భక్తుల కోలాహలంతో నలుమూలల నుంచి లక్షలాది మంది తరలివచ్చే ఈ మహా జాతరను 2026 జనవరి 28 నుంచి 31 వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.

జాతరలో భాగంగా జనవరి 28న కన్నెపల్లి నుంచి సారలమ్మ, జనవరి 29న చిలకలగుట్ట నుంచి సమ్మక్క వనదేవతలు మేడారం(Medaram) గద్దెలకు చేరుకుంటారు. జనవరి 30న భక్తులు అమ్మవార్లకు మొక్కులు చెల్లించనున్నారు. అనంతరం జనవరి 31న సాయంత్రం అమ్మవార్లు తిరిగి వన ప్రవేశం చేయడంతో ఈ మహా జాతరకు ముగింపు పలకనున్నారు. ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరకు దేశవ్యాప్తంగా భక్తులు తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకుంటారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: