తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మేడారం(Medaram Jatara) సమ్మక్క–సారలమ్మ జాతర ఈ నెల 28 నుంచి 31 వరకు జరగనుంది. ఈ నేపథ్యంలో పంచాయతీ రాజ్ శాఖ పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించింది. జాతరకు వచ్చే లక్షలాది భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేస్తోంది.
Read also: Temple Darshan: జనవరి 11న సోమనాథ్ ఆలయాన్ని సందర్శించనున్న మోడీ

23 మంది జిల్లా అధికారులు, 40 మంది డివిజనల్ అధికారులకు బాధ్యతలు
రాష్ట్రంలోని(Medaram Jatara) వివిధ జిల్లాల నుంచి 23 మంది జిల్లా పంచాయతీ అధికారులను జోనల్ కోఆర్డినేటర్లుగా, 40 మంది డివిజనల్ పంచాయతీ అధికారులను సెక్టోరల్ కోఆర్డినేటర్లుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరంతా పారిశుద్ధ్యం, పార్కింగ్, మౌలిక సదుపాయాల పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. నియమితులైన అధికారులు ఈ నెల 24న ములుగు జిల్లా కలెక్టర్‌కు హాజరై విధుల్లో చేరాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. జాతర ఏర్పాట్లతో పాటు అనంతర పారిశుద్ధ్య పనుల కోసం ఫిబ్రవరి 2 వరకు విధుల్లో కొనసాగనున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: