భూమిపై ఉన్న ప్రతి జీవి ఆకలితో బాధపడకుండా ఉండేందుకు, ఆహారాన్ని ప్రసాదించే శక్తిరూపమైన పార్వతీ దేవిని అన్నపూర్ణ దేవిగా ఆరాధిస్తారు. మార్గశిర(Margashira Pournami) మాసంలోని పౌర్ణమి రోజున జరుపుకునే అన్నపూర్ణ జయంతి ఆహారం విలువను గుర్తుచేస్తూ, వంటింటి పవిత్రతను స్మరింపజేస్తుంది.
Read Also: EO Venkaiah Chowdhury: హిందూ ధర్మానికి శ్రీవారిసేవకులు బ్రాండ్ అంబాసిడర్లు

ఒకప్పుడు ప్రపంచమంతా కరువుతో అలమటించిన సందర్భంలో, అన్నపూర్ణ దేవి కరుణతో ఆహార సమృద్ధిని తిరిగి కలిగించిందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ రోజును భక్తులు ఎంతో శ్రద్ధగా పూజలు చేసి జరుపుకుంటారు. ఈ సంవత్సరం అన్నపూర్ణ జయంతి డిసెంబర్ 4, గురువారం రోజున నిర్వహిస్తారు.
ఈ రోజున పాటించే ఆచారాలు
ఈ రోజు ఉదయం వంటింటిని శుభ్రపరచి, వంట పాత్రలు, పొయ్యిని పూజిస్తారు. ఎందుకంటే ఇవే మనకు ఆహారం అందించే సాధనాలు. అన్నపూర్ణ దేవిని సంతోషపరిచే ముఖ్యమైన మార్గం అష్టకం పారాయణం. ఇది సిరిసంపదలు, ధాన్య సమృద్ధి కలిగిస్తుందని విశ్వాసం. ఈ రోజున ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండా పరిశుభ్రమైన సాత్విక ఆహారం వండడం శ్రేష్ఠం. పూర్తిస్థాయి పోషణకు ప్రతీక అయిన దేవికి బియ్యంతో ‘అన్నభిషేకం’ చేసే ఆచారం అనేక ప్రాంతాల్లో పాటిస్తారు.
షోడశోపచార పూజ
దేవికి 16 రకాల ఉపచారాలతో శ్రద్ధగా ప్రత్యేక పూజ చేస్తారు. ఒక సందర్భంలో శివుడు ‘ఆహారం కూడా మాయ’ అని పలికాడు. ఈ మాట విని పార్వతీ దేవి ఆహారం యొక్క అసలైన ప్రాముఖ్యత శివుడికి తెలియజేయాలని భావించి, అన్నపూర్ణ రూపంలో(Margashira Pournami) ప్రత్యక్షమై అనంతరం అదృశ్యమైంది. ఆమె లేని లోపే భూమిపై కరువు ప్రారంభమైంది. జీవులు బాధపడటం చూసి శివుడు ఆహారం విలువను గ్రహించి, దేవిని శరణు కోరాడు. అనంతరం మార్గశిర పౌర్ణమి రోజున దేవి ప్రత్యక్షమై మానవాళికి ఆహార సమృద్ధి ప్రసాదించింది. అప్పటి నుండి ఈ రోజును అన్నపూర్ణ జయంతిగా ఆచరించడం ప్రారంభమైంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: